»   » మెగా అభిమానుల ఆకలి తీరేది..‘బాహుబలి’ని అధిగమించినపుడే!

మెగా అభిమానుల ఆకలి తీరేది..‘బాహుబలి’ని అధిగమించినపుడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ ట్వీట్ చేస్తూ ఉంటాడు. తాజాగా చిరంజీవి 150వ సినిమాను ‘బాహుబలి'తో లింకు పెడుతూ ట్వీట్ చేసాడు. త్వరలో చిరంజీవి 150వ సినిమా మొదలు కాబోతున్న నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమా కావాలి. సినిమా మేకింగ్ విషయంలో మేకర్స్ ఎలాంటి తప్పిదాలు చేయకూడదు. అలా జరిగితే ఆ సినిమా ‘బాహుబలి' కంటే తక్కవ సినిమా అవుతుంది. అది మెగా డిసప్పాయింట్మెంటుకు దారి తీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి 150వ సినిమా సెకండ్ బిగ్గెస్ట్ సినిమా కాకూడదు. ఇది బిగ్గెస్ట్ సినిమా బాహుబలి కంటే బిగ్గర్ సినిమా కావాలి. ఏడేళ్లుగా చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు ఆకలితో ఎదురు చూస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి' కంటే పెద్ద హిట్ అయినపుడే అభిమానుల ఆకలి తీరుతుంది. అంటూ ట్వీట్ చేసాడు.

చిరంజీవి 150వ సినిమా విషయానికొస్తే...
150వ సినిమా నుండి పూరి జగన్నాధ్ ఇంకా తప్పుకోలేదు. సెకండాఫ్ కథ, స్క్రిప్టు వర్క్ ఇంకా పూర్తి కానందునే జాప్యం జరుగుతుందని రామ్ చరణ్ స్పష్టం చేసారు. నాన్నకు సెకండాప్ నచ్చితే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఒక వేళ పూరి దర్శకత్వమే ఫైనల్ అయితే ఆ చిత్రానికి ఆటోజానీ టైటిల్ పెడతామన్నారు. వివి వినాయక్ కూడా చిరంజీవి 150వ సినిమాపై ఆసక్తి చూపుతున్న రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ మాటలు బట్టి చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ పూర్తి స్థాయిలో ఖరారుకా లేదని స్పష్టమవుతోంది. రామ్ చరణ్ ఇచ్చిన ట్విస్టుతో అభిమానులు అయోమయంలో పడ్డారు.

English summary
"The seven year anxious nd hungry wait of all fans of Mega can be only satisfied if the 150th is bigger than the biggest which is Bahubali" Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu