మహేష్ ని ఉద్దేశించి వర్మ కామెంట్
సత్య నుంచీ కంపెనీ దాకా ఉన్న నా నమ్మకాల్ని మహేష్ పోగొట్టాడు. ఇన్నాళ్లూ డర్టీ గా ఉండేవాళ్లే గ్యాంగస్టర్స్ అవుతారనుకున్నా. కానీ అందంగా హ్యాండ్ సమ్ గా ఉండే మహేష్ లాంటి గ్యాంగస్టర్ ని ఎప్పుడూ చూడను అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. అలాగే బిజినెస్ మ్యాన్ చిత్రం ఏస్పరింగ్ గ్యాంగస్టర్ చిత్రం కాదు..ఇన్సైరింగ్ గ్యాంగస్టర్ ఫిల్మ్ అన్నారు. ఇక నేను ముంబైలో బిజినెస్ మ్యాన్ చూసాను. సూపర్ డూపర్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. పెన్ను కనిపెట్టిన తర్వాత ఇంతవరకూ ఇంత బాగుండే డైలాగులు ఎవరూ రాయలేదు.. కంగ్రాట్స్ పూరీ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేసారు. ఇక ఈ చిత్రాన్ని మొదటి నుంచీ వర్మ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే పూరీ శిష్యుడు కావటం ఒక కారణం అయితే,ఈ చిత్రానికి కాన్సెప్టు ఆయనే ఇవ్వటం మరో కారణం.
ఇంతకుముందు కూడా వర్మ.. రేపు అంటే జనవరి 13న పెద్ద సునామీ ఆంధ్రప్రదేశ్ ని తాకబోతోందని వార్త అంటూ ఈ చిత్రం గురించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక నిజానికి బిజినెస్ మ్యాన్ టైటిల్ తో సూర్య హీరోగా వర్మ ఈ చిత్రం చేద్దామని ప్రకటన ఇచ్చారు. అయితే ఆ తర్వాత రక్త చరిత్ర పార్ట్ 2 ప్లాప్ కావటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అయితే ముంబైలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతూండటంతో పూరీ ...ఆయనతో టచ్ లోనే ఉంటూ వచ్చారు.


Click it and Unblock the Notifications











