»   » మహేష్ బాబు క్యారెక్టర్ సన్నీ లియోన్ కంటే సెక్సీగా...

మహేష్ బాబు క్యారెక్టర్ సన్నీ లియోన్ కంటే సెక్సీగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు క్యారెక్టర్ సన్నీ లియోన్ కంటే పది రెట్లు సెక్సీగా ఉంటుందంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ట్వీట్స్ చేసారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అంశాలపై రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్ల వర్షం కురిపించారు.

ఇప్పుడు పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్టోరీ లైన్ విన్నాను. షోలే సైజులో ఉన్న ఈ స్టోరీతో పోలిస్తే ఇప్పటి వరకు వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్, దూకుడు సినిమాలు జస్ట్ యావరేజ్ అనిపించాయి. ఇందులో మహేష్ బాబు క్యారెక్టర్ ఇప్పటి వరకు పూరి సృష్టించిన అన్ని క్యారెక్టర్లన్నింటికంటే, మహేష్ బాబు తన కెరీర్లో పోషించిన అన్ని క్యారెక్టర్లకంటే పది రెట్లు గొప్పగా ఉంటుంది. అన్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్, డైలాగులు సన్నీ లియోన్ కంటే పది రెట్లు సెక్సీయర్ గా ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇదొక సరికొత్త బెంచ్ మార్క్ యాక్షన్ ఎంటర్టెనక్ అని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.

Ram Gopal Varma tweet about Mahesh-Puri movie

పూరి జగన్నాథ్ ట్వీట్స్ ఇలా...
" మహేష్ ఫ్యాన్స్ తో ఇది షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మహేష్,నా కాంబినేషన్ లో రూపొందే 3 వ చిత్రానికి స్క్రిప్టు ఫినిష్ చేసాను..హ్యట్రిక్ కు రెడీగా ఉండండి ", అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేసారు.

ఇక ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవితో పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల అనంతరం వచ్చే ఏడాది మహేష్, పూరి జగన్నాథ్‌ల చిత్రం సెట్స్‌పైకి రానుందని చిత్ర వర్గాల సమాచారం.

English summary
"Mahesh babu character nd dialogue in Puri's is 10 times sexier than Sunny Leone nd 10 times more Bahubalier than Pokiri, Businessman,Dookudu" Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu