twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ దేవుడిని అవమానిస్తున్నారు: వర్మ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించారు. తెలంగాణ వారికి యాదిగిరి నరసింహుడు ఉండగా.....ఆంధ్రా వారి దేవుడు బాలాజీ(వెంకటేశ్వర స్వామి)ని ఎక్కువగా ఎందుకు పూజిస్తున్నారు? ఇది సరైందేనా? అంటూ ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు.

    ఇంతటితో ఆగని రామ్ గోపాల్ వర్మ.....నేను దేవుడిని అసలు నమ్మను, కానీ తెలంగాణ వారు ఆంధ్రా దేవుడైన బాలాజీని పూజించడం అంటే యాదిగిరి నరసింహ స్వామిని అవమానించడమే. తెలంగాణ వారు తమ దేవుడి కంటే ఆంధ్రా దేవున్ని ఎక్కువగా పూజించడం సరైంది కాదు అంటూ వ్యాఖ్యానించారు.

    Ram Gopal Varma tweet about Telangana-Andhra God

    కేసీఆర్...యాదగిరి గుట్టను డెవలప్ చేయాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసే పనులు తెలంగాణ వారు వారి దేవుడి విలువ తెలుసుకునేలా చేస్తాయి అంటూ వర్మ ట్వీట్ చేసారు. రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టుండి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసారనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వ్యాఖ్యలు పబ్లిసిటీ పరంగా ఏమేరకు తోడ్పడుతాయో చూడాలి.

    English summary
    "Is it Right that Telangana people pray to Andhra people's Balaji more than their own Yadagiri Narasimha ? I am not a believer in God but I feel it's insulting to Yadagiri Narasimha that Telangana people pray to Andhra people's Balaji more" Ram Gopal Varma tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X