twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీడీపీ చచ్చిపోయింది, వెన్నుపోటు ఫలితమే: రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్

    |

    2019 ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార తెలుగు దేశం పార్టీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం అవుతోంది.

    ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో సంచలన ట్వీట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీపై కసితీరా కామెంట్లు గుప్పించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఫన్నీ ట్వీట్స్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

    టీడీపీ చచ్చిపోయింది

    పేరు: టీడీపీ

    జననం: మార్చి 29, 1982
    మరణం: మార్చి 23, 2019
    మరణానికి కారణం: అబద్దాలు చెప్పడం, వెన్నుపోటు పొడవటం, అవినీతి, అసమర్ధత, వైఎస్ జగన్, నారా లోకేష్ అంటూ వర్మ ట్వీట్ చేశారు.
    2019 ఎన్నికల ఫలితాల్లో మొత్తం 175 స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా, తెలుగు దేశం పార్టీ కేవలం 25 స్థానాల్లో ముందంజలో ఉంది.

    సైకిల్ టైరు పంక్చర్

    మరో ట్వీట్లో వర్మ... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఫన్నీ ట్వీట్ చేశారు. ఆయన సైకిల్ పంక్చర్ అయినట్లు‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వర్మ అభిమానులు ఈ ట్వీట్లను రీట్వీట్ చేస్తూ తమ ఆనందం ప్రదర్శిస్తున్నారు.

    ఎన్టీఆర్‌కు ఏం చేశానో గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు

    చంద్రబాబు నాయుడు ఒకప్పుడు తన మామ ఎన్టీ రామారావును గద్దెదింపి తాను అధికారం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీన్ని కొందరు చంద్రబాబు వెన్నపోటుగా అభివర్ణించారు. ఆ పరిస్థితులను చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నాడంటూ వర్మ ట్వీట్ చేశారు.

    నన్ను వదిలేయండి, ఇంకెప్పుడూ సర్వేలు చేయను

    ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో లగడపాటి సర్వే తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. అయితే ఈ సర్వే పూర్తిగా తారుమారైంది. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్‌ను ఉద్దేశించి వర్మ ఇలా ఫన్నీట్వీట్ చేశారు.

    English summary
    "Name: TDP, Born : 29th March 1982, Died : 23rd May 2019, Causes of death : Lies , Back Stabbings , Corruption , Incompetence , Y S Jagan and Nara Lokesh." Ram Gopal Varma tweet on 2019 AP Election results.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X