ఒక్క ట్వీట్‌తో 58 లక్షల వ్యూస్..సంచలనం రేపిన రాంగోపాల్ వర్మ పోస్ట్!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. దాదాపు 15 ఏళ్ల క్రితమే ట్విట్టర్‌లో చేరిన ఆయన తనదైన శైలిలో ట్వీట్లతో రచ్చ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆయన చేసిన ట్వీట్లు వినోదాన్ని పంచితే.. మరికొన్ని సార్లు మాత్రం వివాదాలుగా మారాయి. అయినా తన పద్దతిని మార్చుకోకుండా తన మనసులో ఏది అనుకొంటే దానిని ట్వీట్ చేస్తుంటారు. అయితే తాజాగా చేసిన ఓ ట్వీట్ చేసిన మ్యాజిక్ ఏమిటంటే?

సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుందో గ్రహించిన రాంగోపాల్ వర్మ 2009లోనే ట్విట్టర్‌లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి తనకు తెలిసిన సమాచారాన్ని, తన సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు రాజకీయాల్లో తలదూర్చి చేతులు కాల్చుకొన్న సందర్బాలు ఉన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి.

Ram Gopal Varma Tweet on Baba Siddiqui Murder gets Record Views in X Account

అయితే తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ మాత్రం నిజంగా చాలా విషయాలను చెప్పాయి. ముంబైలో జరిగిన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య వెనుక కోణాన్ని, ఎవరి హస్తం ఉందనే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు గ్యాంగ్ స్టర్ ఎవరు? ఆయన ఎందుకు బాబా సిద్దిఖిని చంపారనే ఎవరికి తెలియని విషయాలను వెల్లడించారు. అలాగే సల్మాన్ ఖాన్‌పై బిష్ణోయ్ ఎందుకు పగపడ్డారనే విషయాన్ని క్లారిటీతో వెల్లడించారు.

తాజాగా ఆర్జీవి ట్వీట్ చేస్తూ.. ఓ లాయర్ ఉన్న వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌గా మారడం వెనుక తమ వంశం పూజించే కృష్ణ జింకలను ఓ సూపర్‌స్టార్ హత్య చేయడంతో రగలిన ప్రతీకారమే అందుకు కారణం. ఆ స్టార్‌కు సన్నిహితుడైన రాజకీయ నేతను చంపడానికి ఫేస్‌బుక్ ద్వారా 700 మందిని రిక్రూట్ చేశారు. ఆయన పోలీసులు ఏమీ చేయరు. ఆయన జైలులో ప్రభుత రక్షణలో ఉన్నారు. ఆయన ప్రతినిధి విదేశాల నుంచి వ్యూహం రచిస్తున్నారు అని ట్వీట్ చేశారు. ఈ కథను ఎవరైనా రాస్తే మంచి హిట్ సినిమా అవుతుందని చెప్పారు.

Ram Gopal Varma Tweet on Baba Siddiqui Murder gets Record Views in X Account

రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. బాబా సిద్దిఖీ హత్య వెనుక ఉన్న అసలు విషయాన్ని వెల్లడించడంతో అందరూ అవాక్కయ్యారు. ఆ ట్వీట్‌ను సుమారుగా 58 లక్షల మందికిపైగా చూశారు. ఆ ట్వీట్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాంతో నా అకౌంట్‌లో 6.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నేను చేసిన ట్వీట్‌కు 5.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి అని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Read more about: ram gopal varma baba siddiqui
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X