For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్యపై రాంగోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్: ఛాన్స్ కావాలంటూ రిక్వెస్ట్.. ఆ వెంటనే డిలీట్ చేయడంతో!

  |

  వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ దూసుకుపోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసు దాటినా మరింత ఉత్సాహంగా కనిపించే ఆయన.. సాహసాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఈ సీనియర్ హీరో.. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య Unstoppable with NBK Show అనే షోను హోస్టింగ్ చేస్తున్నారు. మొదటిసారే అయినా ఎవరూ ఊహించని రీతిలో అలరించిన బాలయ్య.. షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ షోపై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ హైలైట్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

  అఖండతో భారీ హిట్ కొట్టిన హీరో

  అఖండతో భారీ హిట్ కొట్టిన హీరో

  వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతోన్న నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుతో కలిసి చేసిన చిత్రమే 'అఖండ'. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. ఇది భారీ హిట్‌గా నిలిచింది.

  ఊహించని ప్రశ్నతో అనసూయకు నెటిజన్ షాక్: మనిద్దరి మధ్య ఏం లేదంటూ యాంకర్ షాకింగ్ రిప్లై

   హోస్టుగా బాలయ్య కొత్త అడుగు

  హోస్టుగా బాలయ్య కొత్త అడుగు


  ఇంత కాలం సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేసిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు హోస్టుగా మారారు. 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ఓటీటీ ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ నెలలో ఈ టాక్ షోను అంగరంగ వైభవంగా స్టార్ట్ చేశారు.

   బాలయ్య మార్క్.. సూపర్ సక్సెస్

  బాలయ్య మార్క్.. సూపర్ సక్సెస్

  సుదీర్ఘ కాలంగా హీరోగా ఉన్న బాలకృష్ణ ఏ షోనూ హోస్ట్ చేయలేదు. కానీ, 'Unstoppable with NBK' షోకు మాత్రం ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేస్తున్నారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన ఏడు ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో షో కూడా సూపర్ డూపర్ హిట్‌ అయింది.

  హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

   9 ఎపిసోడ్స్ పూర్తి... గెస్టులు వాళ్లే

  9 ఎపిసోడ్స్ పూర్తి... గెస్టులు వాళ్లే

  నటసింహా హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షో నుంచి ఇప్పటి వరకూ 9 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. దీనికి మోహన్ బాబు ఫ్యామిలీ, హీరో నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, అఖండ మూవీ యూనిట్, రాజమౌళి, కీరవాణి, పుష్ప టీమ్, రవితేజ, గోపీచంద్ మలినేని, దగ్గుబాటి రానా, లైగర్ మూవీ యూనిట్ సభ్యులు గెస్టులుగా వచ్చిన విషయం తెలిసిందే.

  ఇండియాలోనే గొప్ప షోగా రికార్డు

  ఇండియాలోనే గొప్ప షోగా రికార్డు

  టీవీ, సినిమా, ఓటీటీకి సంబంధించి రేటింగ్‌లు, ర్యాంకులు ఇచ్చే IMDB సంస్థ ఇటీవలే ఇండియాలోని టాప్ 10 టాక్ షోల లిస్టును విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షోకు 9.7 రేటింగ్‌ వచ్చింది. దీంతో ఇది సౌత్‌లోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. అలాగే, ఇండియా వ్యాప్తంగా ఈ షోకు ఐదో ర్యాంక్ కూడా దక్కింది.

  Bigg Boss OTT: షోలోకి టాలీవుడ్ కాంట్రవర్శీ కింగ్.. వామ్మో ఇక హౌస్‌లో కూడా రచ్చ రచ్చే

   ఈ షోపై రాంగోపాల్ వర్మ ట్వీట్

  ఈ షోపై రాంగోపాల్ వర్మ ట్వీట్


  నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షోపై ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. అలాగే, ప్రశంసలు కూడా అందించారు. ఈ క్రమంలోనే తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. 'స్ట్రాటో ఆవరణం ఉన్నంత స్థాయిలో అన్‌స్టాపబుల్ షోను నేను ప్రేమిస్తున్నాను' అని చెప్పాడు.

   డిలీట్ చేసేసిన వర్మ.. ఏమైందో?

  డిలీట్ చేసేసిన వర్మ.. ఏమైందో?

  ఇక, ఇదే ట్వీట్‌లో రాంగోపాల్ వర్మ 'ఈ షోలో పాల్గొనాలని ఆశ పడుతున్నాను. బాలకృష్ణ గారు నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను' అంటూ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కొద్ది సమయంలోనే తెగ వైరల్ అయిపోయింది. అయితే, ఏమైందో ఏమో కానీ, ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని రాంగోపాల్ వర్మ డిలీట్ చేసేశాడు. కానీ, అప్పటికే స్క్రీన్ షాట్స్ నెట్‌లోకి వచ్చేశాయి.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Unstoppable with NBK Show For Aha. Now Sensational Director Ram Gopal Varma Tweet on This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X