'డర్టి పిక్చర్'పై రామ్ గోపాల్ వర్మ కామెంట్
విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ఏక్తా కపూర్ రూపొందించిన డర్టీపిక్చర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ...డర్టీ పిక్చర్ ని ఫ్యామిలీలు కూడా చూసేలా రూపొందించినందుకు ఫ్యామిలీ క్వీన్ ఏక్తాకు కుదాస్ అంటూ మెచ్చుకున్నారు. అలాగే అన్ని కుటుంబాలకి మనస్సు లోపల అంతర్గతంగా డర్టీ అనేది ఉంటుందని చాలా కాలంగా నా మనస్సులో అనుమానం ఉండేది. అది నిజమేనని ఏక్తా ప్రూవ్ చేసింది అని ట్వీట్ చేసారు.
ఇక విద్యాబాలన్,నసీరుద్దీన్ షా కాంబినేషన్ లో వచ్చిన డర్టీ పిక్చర్ మొన్న శుక్రవారం దేశమంతటా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదల చేసారు. సిల్మ్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 21 కోట్ల బడ్జెట్ తో ఏక్తా కపూర్ నిర్మించింది. మిలింద్ లూద్రియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓపినింగ్స్ బాగానే తెచ్చుకోలగలిగింది. అలాగే దేశం మొత్తం మీద హిందీ వెర్షన్ కి శుక్రవారం 9.5 కోట్లు,శనివారం 10.7 కోట్లు,ఆదివారం 12.3 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











