వర్మ కామెంట్: పవన్ ‘ఇజం’ పుస్తకంపై సెటైర్!

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీపై ట్విట్టర్లో ట్వీట్ల వర్షం కురిపిస్తూ.....పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపించిన వర్మ ఇటీవల విశాఖలో పవన్ విడుదల చేసిన 'ఇజం' పుస్తకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ''ఇజం' పుస్తకం కదివాను. నాకైతే పెద్దగా అర్థం కాలేదు. ఇజం పుస్తకం రాసిన రచయితలకైనా అర్థమవుతుందా? అనే అనుమానం వచ్చింది. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా మార్పులు చేసి 'ఇజం' పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ మళ్లీ విడుదల చేస్తారని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్, జన సేన పార్టీపై వర్మ గతంలో చేసిన ట్వీట్స్....

Ram Gopal Varma tweet on ISM book

జన సేన కంటే గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదు. శివ సేన కన్న 1000 రెట్లు బెటర్. పేరులోనే ఇంతుంటే పార్టీలో ఎంతుంటుందో. ప్రజారాజ్యం‌లో జరిగిన అవకతవక పనులు జనసేన పార్టీలో అసలు జరుగవని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. పవన్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కనుక జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించే తెలివి తెలుగువాళ్లకి ఉందని ఆశిస్తున్నాను' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

'నా ఉద్దేశ్యంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నవాడెవడైనా సరే కేవలం పవన్ కళ్యాణ్ జనసేనకే ఓటు వేస్తాడు. జన సేన కేవలం కొత్తగా వస్తున్న ఇంకో పార్టీ అనుకుంటే బుద్ది తక్కువ మూర్ఖత్వం, జనసేన జనం కోసం, పవన్ సేన సృష్టిస్తున్న ఒక ప్రభంజనం' అని వర్మ వ్యాఖ్యానించారు.

నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ పవన్ కళ్యాణ్ దేవుడిలా కనిపిస్తున్నారు. తెలుగు ప్రజలకు మొదడు ఉంటే బాలాజీ, సాయిబాబా లాంటి వారిని వదిలేసి పవన్ కళ్యాణ్‌ను పూజించండి' అంటూ వర్మ ట్వీట్ చేసాడు.

'పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రజల్లో ఒక అద్భుతమైన ప్రభావం చూపింది. కానీ ఆయన కొందరు వ్యక్తులతో చేతులు కలపడం భయాన్ని కలిగిస్తోంది' అంటూ మోడీ-పవన్ మీటింగును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X