కొలవెరిడి పాటపై వర్మ కామెంట్

By Srikanya

ఎక్కడ చూసినా ఇప్పుడు ధునుష్ తాజా పాట కొలావరి డి వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటను విన్న రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ..నేను కొలావరి డి పాటకు చాలా కన్ఫూజ్ అయ్యాను..ఎందుకంటే నేను ఇష్టపడ్డానా లేక అందరూ ఇష్టపడ్డారు కాబట్టి నచ్చిందా అన్నది తెలియటం లేదంటూ ట్వీట్ చేసారు. ధనుష్ తాజా చిత్రం 3 లోది ఈ పాట.ఇక తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన '3" సినిమాలోది ఈ పాట. ఈ చిత్రంతో పరిచయమవుతున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర ఈ పాటకు సంగీతం కూర్చారు. అలాగే ఈ పాటను స్వయంగా ధనుష్ రాసి, పాడటం మరో విశేషం. ఇంగ్లిష్ లిరిక్స్‌తో సాగే ఈ పాటలో తప్పులు ఎన్నో కనిపిస్తాయి.

అయితే వాటిని ప్రక్కన పెట్టి ఆ ఫీల్ ని యూత్ పట్టుకుని పాపులర్ చేసింది. ఇక ఈ పాట లిరిక్ ఇలా సాగుతుంది..'కొలవెరి.. కొలవెరిడి.. మూను కలరూ వైటూ.. వైటూ.. బ్యాక్‌గ్రౌండూ నైటూ నైటూ.. వైటు స్కిన్ను గర్ల్ గర్ల్.. గర్లు హార్టూ బ్లాకూ.. లవ్వూ.. లవ్వూ.. ఓ మై లవ్వూ..." అంటూ పాట కుండాల్సిన వ్యాకరణం ప్రక్కన పెట్టి ధనుష్ ఈ పాట రాశారు. ఈ పాట హిట్టవటంతో సంగీతం అందించిన అనిరుధ్ కి విపరీతమైన ఆఫర్స్ వస్తున్నాయి. అమితాబ్,అభిషేక్ బచ్చన్ లు ఈ పాట గురించి తమ ట్విట్టర్ లో రాసి మరింత ప్రాచుర్యం కలిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X