ఆరియానాతో మరోసారి ఆర్జీవీ రచ్చ: ఆ పార్టులు చూపిస్తూ షాకింగ్‌గా.. ఆయనేంటి అక్కడే చూస్తున్నాడు!

ఒకప్పుడు దేశమే గర్వించదగ్గ సినిమాలు చేసి ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే, కొంత కాలంగా అతడి పంథా పూర్తిగా మారిపోయింది. దీంతో నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్నాడు. ఫలితంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఫేం ఆరియానా గ్లోరీతో ఇటీవల హాట్ వర్కౌట్ చేస్తూ దిగిన ఫొటోలను వదిలాడు. ఇప్పుడు మరోసారి ఆమెతో కలిసి రచ్చ చేసిన దర్శకుడు.. వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

 బయోపిక్స్ అంటూ వర్మ సంచలనం

బయోపిక్స్ అంటూ వర్మ సంచలనం

కెరీర్ ఆరంభంలో గొప్ప గొప్ప కథలతో అన్ని జోనర్లలోనూ సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ.. కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేశాడు. ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర' నుంచి వరుసగా 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి సినిమాలు తీశాడు. ఇక, గత ఏడాది పవన్ కల్యాణ్‌ రాజకీయాలపై 'పవర్ స్టార్' అనే చిత్రాన్ని వదిలాడు.

 లాక్‌డౌన్‌లోనూ రిలీజ్ చేసేలా ప్లాన్

లాక్‌డౌన్‌లోనూ రిలీజ్ చేసేలా ప్లాన్

రాంగోపాల్ వర్మ తీసే సినిమాలకు సెన్సార్ చిక్కులు ఎదురవుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయన చిత్రాలపై కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ సరికొత్తగా ఆలోచించాడు. ఇందులో భాగంగానే 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సొంతంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసుకున్నాడు. దీని ద్వారానే తన సినిమాలను విడుదల చేస్తున్నాడు.

ఇప్పుడన్నీ అలాంటి సినిమాలతోనే

ఇప్పుడన్నీ అలాంటి సినిమాలతోనే

కరోనా ప్రభావంతో థియేటర్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు అందరూ ఓటీటీ ఫ్లాట్‌ఫాంల వైపు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాంగోపాల్ వర్మ 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 'క్లైమాక్స్', 'నగ్నం', 'పవర్ స్టార్', 'దిశ', 'మర్డర్', 'డేంజరస్', 'కరోనా వైరస్' వంటి వినూత్నమైన చిత్రాలను తీస్తూ ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

అందులోనే ఉంటూ రచ్చ రచ్చ చేసి

అందులోనే ఉంటూ రచ్చ రచ్చ చేసి

వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో ఆయన తరచూ ఏదో ఒక పోస్టును పెడుతూనే ఉంటాడు. సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసే ఈ దర్శకుడు.. వివాదాలకు కేంద్ర బిందువులా అవుతున్నాడు. అదే సమయంలో అప్పుడప్పుడూ హాట్ పిక్స్‌నూ వదులుతున్నాడు.

 ఆరియానాతో ఆర్జీవీ హాట్ వర్కౌట్లు

ఆరియానాతో ఆర్జీవీ హాట్ వర్కౌట్లు

రాంగోపాల్ వర్మ వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఫేమస్ అయిపోయారు. అలాంటి వారిలో యాంకర్ కమ్ యాక్టర్ ఆరియానా గ్లోరీ ఒకరు. చాలా రోజుల క్రితం వర్మను బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన ఈ బ్యూటీ ఆ దెబ్బతో పాపులర్ అవడంతో పాటు బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసింది. ఇక, ఇప్పుడు ఆర్జీవీతో కలిసి హాట్ వర్కౌట్లు చేస్తూ కనిపించింది. ఈ ఫొటోలను ఇటీవల ఇద్దరూ షేర్ చేసుకున్నారు.

ఆ పార్టులు చూపిస్తూ... పోల్ పెట్టి

ఆ పార్టులు చూపిస్తూ... పోల్ పెట్టి


తాజాగా రాంగోపాల వర్మ తన ట్విట్టర్‌లో వరసగా ఫొటోలను షేర్ చేశాడు. అందులో ఓ అమ్మాయి బ్యాక్‌ను, నడుమును, ఎద భాగాన్ని ఫోకస్ చేస్తూ తీసిన ఫొటోలను వదిలి.. అందులో ఉన్నది ఎవరో కనిపెట్టమన్నాడు. దీనికి చాలా మంది ఆరియానా గ్లోరీ అంటూ బదులిచ్చారు. నిజంగానే అందులో ఉన్నది ఆమె కాబట్టి.. ఆ తర్వాత వర్మ కూడా ఆ పేరును రివీల్ చేస్తూ ట్వీట్ చేశాడు.

Recommended Video

Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu
ఆయనేంటి అక్కడే చూస్తున్నాడు

ఆయనేంటి అక్కడే చూస్తున్నాడు

రాంగోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన ఫొటోలలో ఒకటి మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి కారణం ఆరియానా వర్కౌట్ చేస్తుండగా.. ఆయన కింద భాగంలో చూస్తూ కనిపించాడు. ఇది చూసిన వారంతా ఆయనేంటి అక్కడే చూస్తున్నాడు అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక, బ్యాక్‌ను చూపిస్తూ షేర్ చేసిన ఫొటోను ఎవరు తీశారో కూడా రివీల్ చేస్తూ పోస్ట్ పెట్టాడు వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X