క్లైమాక్స్‌ను కరోనా కాదు.. దేవుడు కూడా ఆపలేడు.. మే 29న రిలీజ్.. ఆర్జీవి సంచలన ప్రకటన
కరోనావైరస్, లాక్‌డౌన్ కాదు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంచనాలు సృష్టించడం రాంగోపాల్ వర్మకు వెన్నతోటి పెట్టిన విద్య. క్రైసిస్ సమయాల్లనో పాపులారిటీ సాధించడం, వ్యక్తిగత ఎజెండాను అమలు చేసి పబ్లిక్ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకోవడం వర్మకు కొత్తేమీ కాదు. లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లన్నీ మూతపడిన నేపథ్యంలో క్లైమాక్స్ సినిమాను తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేలా అంటే..

లాక్‌డౌన్‌లో ఆర్జీవి మోత
శృంగార నటి మియా మాల్కోవాతో రూపొందించిన క్లైమాక్స్ సినిమా ప్రమోషన్‌తో లాక్‌డౌన్‌లో మోత మోగిస్తున్నాడు. ఇటీవల రిలీజైన టీజర్‌తో అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకొన్నాడు. తాజాగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని రేపాడు. ఇలా సినిమాపై అంచనాలు పెంచుతూ మే 29వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు.

దేవుడు కూడా ఆపలేదు
క్లైమాక్స్ సినిమా రిలీజ్ గురించి ట్విట్టర్‌లో వర్మ ట్వీట్ చేస్తూ.. దేవుడు కాదు కదా.. సాక్షాత్తూ కరోనా దిగివచ్చినా క్లైమాక్స్ సినిమా రిలీజ్‌ను ఎవరూ ఆపలేరు. క్లైమాక్స్ సినిమాను #RGVWorldTheatre, @shreyaset యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. మే 29 తేదీన 11 గంటలకు మొదటి ఆట ప్రారంభమవుతుంది అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

ఓటీటీలో క్లైమాక్స్ రిలీజ్
థియేటర్ల కంటే ఓటీటీలో ఉండే అడ్వాంజీలు చెప్పలేనన్నీ ఉన్నాయి. ఏ సినిమానైనా ఓటీటీలో చూడటం చాలా సులభం. అలా మా క్లైమాక్స్ సినిమాను #RGVWorldTheatre, @shreyaset యాప్‌లో చూడవచ్చు. మా యాప్‌లో సినిమా చూసే వారు పాప్‌కార్న్, కోక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అంటూ వర్మ మరో ట్వీట్ చేశాడు.

థియేటర్లపై ఓటీటీ ప్రభావం
సినిమా థియేటర్లపై ఓటీటీ ప్రభావం చాలాకాలం పడుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కరోనావైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో ఆ విషయం ప్రతీ ఒక్కరి కళ్లు తెరిపించింది. ఇక నుంచి సినిమాల విషయంలో ఓటీటీలదే కీలక పాత్ర అనే విధంగా రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Recommended Video

ప్రేక్షకుల వదిలేసిన ఛాయిస్
ప్రస్తుత కాలంలో థియేటర్ల కంటే కొత్త టెక్నాలజీలో సదుపాయాలు బ్రహ్మండంగా ఉన్నాయి. క్లైమాక్స్ సినిమాను ప్రేక్షకులు ఎక్కడ, ఎప్పుడు, ఎలా చూడాలనే విషయం మే 29వ తేదీన చూస్తారు. ప్రేక్షకులు శ్రేయాసెట్ యాప్‌లోని ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో క్లైమాక్స్ సినిమా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.


Click it and Unblock the Notifications











