»   » రజనీ నవ్వులపాలవుతాడు, చిరు చేయలేరు: వర్మ సంచనల కామెంట్స్

రజనీ నవ్వులపాలవుతాడు, చిరు చేయలేరు: వర్మ సంచనల కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ... ఎక్కడ ఉన్నా తనపై మీడియాతో పాటు సినీ ప్రేక్షకుల ఫోకస్ ఉండేలాచూసుకుంటాడు. అందుకోసం ఆయన చెడ్డపేరు తెచ్చుకోవడానికైనా, సంచలన కామెంట్స్ చేయడానికైనా, వివాదాలు సృష్టించడానికైనా వెనకాడరు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో మకాం వేసిన వర్మ తెలుగు మీడియాకు వివాదాల రూపంలో కావాల్సినంత స్టఫ్ అందించారు.

బిగ్ బి మనవరాలి బికినీ డాన్స్ వీడియో హల్ చల్ (వీడియో)

ప్రస్తుతం వర్మ టాలీవుడ్ కి టాటా చెప్పి బాలీవుడ్లో తిష్టవేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఉన్నంత కాలం ఇక్కడి లోకల్ సెలబ్రిటీలను టార్గెట్ చేసిన వర్మ ఇపుడు బాలీవుడ్లో అడుగు పెట్టిన తర్వాత నేషనల్ లెవల్లోని సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. త్వరలో వర్మ అమితాబ్‌తో సర్కార్-3 చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ మీద పొడ్తలు గుప్పించడంతో పాటు రజనీ, చిరంజీవి లాంటి సౌత్ స్టార్లను తక్కువ చేసి మాట్లాడుతూ కామెంట్స్ చేసారు.

అతని వల్లే... రజనీ, ఎస్పీ బాలు బంధానికి బ్రేక్!

అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'తీన్' సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. అమితాబ్ హీరోయిక్ పాత్రలకు అదే సమయంలో ప్రయోగాత్మక పాత్రలకు బాగా సూటవుతారని కితాబిచ్చారు. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్ లాంటి స్టార్స్ ఇలా చేయలేరని అభిప్రాయ పడ్డారు. అమితాబ్ సినీ రంగ అభివృద్ధి కోసం తన ఇమేజ్ ను పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నారంటూ పొగడ్తలు గుప్పించారు.

రజనీ మీద వర్మ చేసిన దారుణమైన కామెంట్స్ స్లైడ్ షోలో...

రజనీ చేస్తే ఆదరించరు..

రజనీ చేస్తే ఆదరించరు..


తీన్ లాంటి సినిమా రజనీ చేస్తే ఎవరూ చూడరు..... అదే రోబో లాంటి సినిమా అమితాబ్ చేస్తే ఇంకా పెద్ద విజయం సాధించేది అని వర్మ కామెంట్ చేసారు.

రజనీ నవ్వుల పాలవుతాడు

రజనీ నవ్వుల పాలవుతాడు


తీన్, పికూ, బ్లాక్ లాంటి సినిమాలు రజనీకాంత్ చేస్తే నవ్వుల పాలవుతారు అంటూ వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఒక్క మార్కే...

ఒక్క మార్కే...


రజనీ తీన్ సినిమా తీస్తే ఒక్క మార్కే పడుతుందని.... అమితాబ్ ‘కబాలి' తీస్తే వంద మార్కులు పడతాయంటూ వర్మ ట్వీట్ చేసారు.

రజనీ స్పందించాలి

రజనీ స్పందించాలి


రజనీకాంత్ తన కామెంట్స్ మీద స్పందించాలంటూ వర్మ డిమాండ్ చేయడం కొసమెరుపు

English summary
"My belief as a Rajni fan is If SrBachchan does Robot it will do far far better and if superstarrajini does Te3n it will do far far lesser" Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu