చెమటలతో జగన్.. సైకిల్ గుర్తుకి ఓట్లెందుకు పడలేదో రీజన్ చెబుతూ వర్మ సంచలన పోస్ట్

Recommended Video

RGV Sensational Tweet On TDP Defeat || Filmibeat Telugu

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఊహించని రీతిలో తెలుగు దేశం పార్టీ పరాజయం పాలు కావడం వర్మ చేతిలో బంతిలా మారింది. ఎటు దొరికితే అటు అన్నట్లుగా చంద్రబాబు నాయుడును, ఆ పార్టీ వర్గాలను ఓ ఆట ఆడేసుకుంటున్నాడు వర్మ. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ చేసిన కొన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూస్తే..

లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం

లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారు చంద్రబాబు నాయుడు. కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అప్పుడు హాట్ హాట్ చర్చలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే వర్మను ముప్పుతిప్పలు పెట్టిన టీడీపీ పరాజయం పాలవడంతో ఇక ఆయన తనదైన స్టైల్‌లో చంద్రబాబుకు చురకలంటిస్తున్నారు.

ఊహించని విధంగా జగన్

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ విజయం పట్ల కాస్త డౌట్ ఉన్నప్పటికీ.. తీరా ఫలితాలు చూస్తే వైసీపీ పార్టీకి ఊహించని విజయం దక్కింది. మొత్తం 175 స్థానాలకు గాను ఏకంగా ముప్పావు వంతు స్థానాలు గెలుచుకొని రికార్డు తిరగరాశారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఆయన విజయానికి కారణం ఇదే అంటూ ఫన్నీగా వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

తన కొడుకు చెప్పాడంటూ వర్మ

తన కొడుకు చెప్పాడని పేర్కొంటూ తెలుగు దేశం పార్టీ ఓటమిపై వర్మ చేసిన ఫన్నీ ట్వీట్ సోషల్ మీడియా సెన్సేషన్ అవుతోంది. గాలిపోయిన సైకిల్ పక్కన ఏదో ఆలోచిస్తూ బాధగా కూర్చున్న చంద్రబాబు ఫోటో పెట్టిన వర్మ.. దానికి ''నా కొడుకు చెప్పాడు.. అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయడానికి కారణం పోలింగ్ బూత్‌లో హాట్‌గా ఉండటమే'' అని కాప్షన్ పెట్టారు. ఈ వెరైటీ ట్వీట్ చంద్రబాబును నవ్వుల పాలు చేస్తోంది.

చెమటలతో జగన్..

చెమటలతో జగన్..

ఇక ముఖం నిండా చెమటలతో ఉన్న జగన్ పిక్ షేర్ చేసిన వర్మ.. ''10 సంవత్సరాలుగా జగన్ లోని ఎమోషన్ ని సెన్సార్ చేసిన తాజా పిక్ ఇది. దమ్ముంటే చంద్రబాబుకు సంబంధించి ఇలాంటి పిక్ ఉంటే షేర్ చేయండి.. ఛాలెంజ్'' అని పేర్కొనడం విశేషం. తమ అభినవ ముఖ్యమంత్రి చెమటలతో ఉన్న జగన్ పిక్ చూసి లైకులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు ఆంధ్రా జనం.

ప్రతీకారమంటే ఇదీ

ప్రతీకారమంటే ఇదీ

ప్రస్తుతం వర్మ చేస్తున్న ట్వీట్లపై వేల కొద్ది కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో మిమ్మల్ని ఇబ్భంది పెట్టిన చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతీకారమంటే ఇదీ అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X