twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌కు సంపూకి తేడా లేదా? క్రిమినల్‌గా లాక్కొంటే లూటీ.. ప్రభుత్వం ఎవరు? పేర్ని నానికి ఆర్జీవి కౌంటర్

    |

    ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా టికెట్ల తగ్గింపు వ్యవహారంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అనుసరిస్తున్న విధానాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ గత రెండు రోజులుగా టెలివిజన్, సోషల్ మీడియా మాధ్యమాల్లో తూర్పారపడుతున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఏమిటి? అని ఘాటుగా ఆర్జీవి ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం 10 ప్రశ్నలతో కూడిన వీడియోను రిలీజ్ చేసిన తర్వాత బుధవారం మంత్రి నాని తనదైన శైలిలో స్పందించారు. అయితే మంత్రి పేర్ని నాని చేసిన ట్వీట్లపై మరింత ఘాటుగా వర్మ స్పందిస్తూ..

     బలవంతుడు లాగేసుకొంటే లూటీ..

    బలవంతుడు లాగేసుకొంటే లూటీ..

    సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి అని మంత్రి పేర్ని నాని చేసిన ట్వీట్‌కు ఆర్జీవి బదులిస్తూ.. సారీ నాని గారు లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్‌గా లాక్కున్నప్పుడు... అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని లావాదేవీ అంటారు ...ఆ ట్రాన్సాక్షన్ లీగల్‌గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది అని వర్మ సూచించారు.

    మీకు మీరు చెప్పుకొంటే సరిపోతుందా?

    మీకు మీరు చెప్పుకొంటే సరిపోతుందా?

    ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చు గానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అంటూ పేర్ని నాని చేసిన ట్వీట్‌పై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ..

    థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో కానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు అని పేర్ని నాని చేసిన ట్వీట్‌పై వర్మ సమాధానం ఇచ్చారు.

    మీ ప్రభుత్వంలోని వారిని అడగండి..

    మీ ప్రభుత్వంలోని వారిని అడగండి..

    ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అని పేర్ని నాని లేవనెత్తిన ప్రశ్నకు మరో విధంగా వర్మ సమాధానం ఇస్తూ..

    థియేటర్లనేవి, జూన్ 19 1905న నికెలోడియోన్ అనే ప్రపంచంలోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు.. అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు.. కావాలంటే మీ గవర్నమెంట్‌లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అని వర్మ సెటైర్ వేశారు.

    మీ కార్యకర్త మీలా మంత్రి కావాలనుకోవడం

    మీ కార్యకర్త మీలా మంత్రి కావాలనుకోవడం

    బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ అనే ప్రశ్నకు వర్మ సమాధానం ఇస్తూ..

    సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా ఉన్న పొజిషన్ కన్నా ఎదగాలని కోరుకుంటాడు.. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు. మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్‌తో.. ఆ బెటర్‌గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే అంటూ ఓ నగ్నసత్యాన్ని పేర్ని నానికి వర్మ చెప్పే ప్రయత్నం చేశారు.

    Recommended Video

    AP Ticket Rates: RGV Questions To AP Govt | CM Jagan | Oneindia Telugu
    పవన్ కల్యాణ్‌కు సంపూకే తేడా లేకపోతే..

    పవన్ కల్యాణ్‌కు సంపూకే తేడా లేకపోతే..

    హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు RGVzoomin గారూ అంటూ మంత్రి పేర్ని నాని లేవనెత్తిన ప్రశ్నకు రాంగోపాల్ వర్మ సమాధానం ఇస్తూ..

    నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరు? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్‌కి కూడా తేడా లేదా? అని వర్మ ఘాటుగా స్పందించారు.

    English summary
    Ram Gopal Varma satires on Minister Perni nani over ticket rates issue in Andhra pradesh. In tthis occasion, Minister Perni Nani gives counter To Varma. Now, RGV gives sharp answer to Perni nani tweets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X