twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌గోపాల్‌వర్మ ఆఫీసులో సోదాలు

    By Srikanya
    |

    Ram Gopal Varma
    ముంబై: ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ కార్యాలయాలపై సేవా పన్ను విభాగం అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. సేవా పన్ను చెల్లింపునకు సంబంధించి ఆయన తన పేరును నమోదు చేసుకోకపోవడం ఇందుకు కారణం. సాధారణంగా సినిమా డెరైక్టర్లు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రామ్‌గోపాల్ వర్మ సినిమా ఆఫీసులో అధికారులు సోదాలు నిర్వహించారని, ఆయన స్టేట్‌మెంట్‌ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని సమీర్ వాంఖడే...డిప్యూటీ కమీషనర్ ఆఫ్ సర్వీస్ టాక్స్...ధృవీకరించారు...అయితే మిగతా వివరాలు తెలపటానికి నిరాకరించారు.

    గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో.......ఇప్పటి పరిస్థితుల ఆధారంగా 'సత్య 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, అనైక జంటగా ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. అయితే బిజినెస్ అనుకున్న రేంజిలో కావటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం.

    రామ్ గోపాల్ వర్మ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావటంతో ఈ చిత్రం బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ పడిందని సమాచారం. దాంతో వర్మ ఎలాగైనా ఈ సినిమాని ఒడ్డున పడేయాలని సతమతమవుతున్నట్లు ముంబై వర్గాల సమాచారం. మరో ప్రక్క శర్వానంద్ కూడా క్లాస్ హీరో కావటంతో బిజినెస్ పరంగా పెద్ద హెల్ప్ కావటంలేదు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అందరికీ బిజినెస్ మ్యాన్ చిత్రం గుర్తుకు తేవటం కూడా మైనస్ గా మారింది. అయితే చిత్రం పై వర్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

    వర్మ మాట్లాడుతూ...1998లో వచ్చిన 'సత్య' అప్పటి పరిస్థితుల ఆధారంగా రూపొందించాం. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా ఈచిత్రం తెరకెక్కించాం. క్రైమ్ చేసే వ్యక్తి సైకాలజీ స్టడీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ధీరూబాయ్ అంబానీ లాంటి వ్యక్తి కార్పొరేట్ సంస్థల వైపు కాకుండా, అండర్ వరల్డ్ వైపు వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం' అన్నారు.

    శర్వానంద్ మాట్లాడుతూ....రామ్ గోపాల్ వర్మ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ తో కలిసి పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ కల తీరింది. ఈ సినిమాలో కొత్తరకం క్రైమ్ కోణం ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రాన్ని సుమంత్ మెట్టు, చంద్రశేఖర్ ...ముమ్మత్ మీడియా అండ్ ఎంటర్టెన్మెంట్ ప్రై.లి, జెడ్ 3 పిక్చర్స్ బేనర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అమర్ మోహిలె, సినిమాటోగ్రఫీ : వికాస్ సారాఫ్, దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ.

    English summary
    The Service Tax Department officials on Wednesday conducted a survey at the offices of filmmaker Ram Gopal Varma, for allegedly not registering himself with the Department for the assessment purposes. Sameer Wankhade, Deputy Commissioner, Service Tax, confirmed the development but refused to divulge further details. Sources in the department said officials visited the offices of Verma's company, 'Ram Gopal Film Factory', and were in the process of recording his statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X