పబ్లిసిటి కోసం వారానికొకటి-వర్మ ప్లాన్ వర్కఅవుట్ అయ్యేనా...
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ. వర్మ ఏం చేసినా సంచలనమే..ఎప్పుడూ సరికొత్తగా వుండేందకు సరికొత్త ఐడియాలు ఆలోచించడం వర్మకే చెల్లింది. తాజాగా అలా వర్మ తెరపైకి తెస్తోన్న వెరైటీ ఏంటో తెలుసా..? తన తాజా చిత్రం 'కథ స్ర్కీన్ ప్లే దర్వకత్వం: అప్పల్రాజు" సినిమా ఆడియోను ఒక్కసారి కాకుండా ఒక్కో వారం ఒక్కో పాట విడుదల చేసేలా ప్లాన్ చేశాడు వర్మ.
ఈ నెల 29నుండి సినిమా విడుదలయ్యేదాకా వారానికి ఓ పాట చొప్పున ఒక్కో సీడీ విడుదల చేయనున్నారట. అంటే మొత్తంగా ఆరు సీడీలన్నమాట, ఈ ఆరు పాటలూ కలిపి చివర్లో ఓ సీడీ రూపంలో విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించేశారు. ఆరు పాటల కోసమే సీడీ కొనడానికి పెద్దగా ఇప్పుడు ఆసక్తి చూపడంలేదెవరూ..అలాంటిది వారానికి ఓ పాట..అందుకోసం ఓ సీడీ..అంటే సంగీత ప్రియులకు కొంచెం ఇబ్బంది పడే అంశమే. అయినాసరే..ఈ సరికొత్త ప్రయోగం బాగా వర్కవుట్ అవుతుందనీ, సినిమా పబ్లిసిటీకి భలేగా పనిచేస్తుందని వర్మ భావిస్తున్నాడు. చూద్దాం..సునీల్ ని హీరోగా పెట్టి సంచలనాలకు తెరలేపిన వర్మ. 'అప్పల్రాజు" సినిమా ఆడియోని మరింత వెరైటీగా ప్లాన్ చేసిన దరిమిలా, సినిమాకి ఏ మేరకు పబ్లిసిటీ కలిసొస్తుందో...


Click it and Unblock the Notifications











