అహంకారానికీ ఆలోచనకి మధ్య యుద్ధం.. వ్యూహం ఫోటోలతో ఆర్జీవి సెన్సేషన్.. వైఎస్ భారతీ పాత్ర ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ఈ సారి ఏపీ ఎన్నికలకు, తెలుగు సినిమా రంగంలో కూడా పాలిటిక్స్ జోరుగా సాగే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి నుంచి అధికార, రాజకీయ పార్టీలు తమదైన శైలిలో సినీ అస్త్రాన్ని వాడుకొంటున్నాయి.
తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సినిమాలతో రాజకీయ వ్యంగ్యాస్త్రాలు, సినీ విమర్శలు, ఆరోపణాస్త్రాలతో సిద్దమవుతున్నది. అయితే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాకు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సినిమాలను అస్త్రాలను చేసుకోని ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసేందుకు వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతున్నది. ఇప్పటికే మహీ వీ రాఘవ దర్శకత్వంలో జగన్ బయోపిక్ రెడీ అవుతుండగా.. రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాతో సిద్దమవుతున్నాడు.ఈ సినిమాను గుట్టు చప్పుడు కాకుండా తెరకెక్కిస్తూ సంచలనానికి దారి వేస్తున్నారు.
గత కొద్దికాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో దర్శకుడు రాంగోపాల్ వర్మ సన్నిహితంగా మెదులుతున్నాడు. వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో చంద్రబాబుకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాను అని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు.

అయితే వ్యూహం సినిమాను చాపకింద నీరులా రూపొందిస్తూ రాంగోపాల్ వర్మ తన పని తాను చూసుకొంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించి.. వాటి ఫోటోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ చిత్రం పలు ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. వైఎస్ఆర్ ఫోటోలు కూడా ఉండటం గమనార్హం.
రాజకీయ కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న వ్యూహం చిత్రాన్ని రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ, మలయాళ నటుడు అజ్మల్ పోషిస్తుండగా.. వైఎస్ భారతీ పాత్రను మానస అనే కొత్త నటి పోషిస్తున్నారు. అహంకారానికీ ఆలోచనకి మధ్య జరిగిన యుద్ధమే వ్యూహం అంటూ ఫోటోలు రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











