పోర్న్ ని లీగలైజ్ చెయ్యమంటూ వర్మ
ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మల్యేలు అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై వర్మని ముంబై కి చెందిన పత్రిక వారు అభిప్రాయం అడగ్గా ఆయన స్పందిస్తూ... పోర్న్ ని లీగలైజ్ చేయటం బెస్ట్ ..అలా చేస్తే మన పిల్లల్ని,ఆడవాళ్లని కాపాడుకోవచ్చు అన్నారు. పోర్న్ ని లీగలైజ్ చేస్తే క్రేమ్ రేట్ తగ్గే అవకాశముందని అన్నారు. ఇక వయస్సు వచ్చిన వారంతా పోర్న్ ని చూడటం కామన్... ఎవరైనా పోర్న్ ని చూడటం లేదంటే అది అబద్దమని అన్నారు.
మనం ఉద్యోగాలలో బోర్ కొట్టినప్పుడు.. వేరే డైవర్షన్ కోరుకుంటాము కదా... నేను సైతం డైరక్షన్ చేసేటప్పుడు బోర్ కొడితే ఫోన్ లో కాల్స్ కాకుండా మిగతావి వెతుక్కుంటాను అన్నారు. అలాగే ఆ ప్రశ్న అడిగే రిపోర్టర్ ని మీరు..ఎప్పుడూ మీ వృత్తిలో బోర్ కొట్టినప్పుడు పోర్న్ సైట్ లు చూడరా అని ప్రశ్నించారు. అలాగే తన తాజా చిత్రంలో ఈ సన్నివేశాలను పెడతానని శెలవిచ్చారు. ఇక ఈ సంఘటన ద్వారా మన పొలిటీషన్స్..కేవలం కరప్టెడ్ మాత్రమే కాదు... హ్యూమన్స్ అని కూడా అర్దమైందని వ్యగ్యంగా అన్నారు. ప్రస్తుతం వర్మ తన తాజా చిత్రం డిపార్టమెంట్ లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











