మరో పెళ్లికి వర్మ రెడీ.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో చెప్పడం కష్టం. ఏ క్షణాన ఎలాంటి ట్వీటేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాడో చెప్పడం మరీ కష్టం. ఆయన ట్వీట్స్, కామెంట్స్ ఓ పట్టాన అర్థం కావు. అంతలా అయోమయానికి గురి చేసేలా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. చీటికి మాటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆడిపోసుకునే వర్మ.. తాజాగా ఓ ట్వీట్ చేశాడు. అయితే ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ వేశాడో ఓ సారి చూద్దాం.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లో నిర్మించిన అతి పెద్ద స్టేడియంలో ట్రంప్, మోదీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలపై, ట్రంప్ ప్రసంగంపై అప్పట్లో ఎన్ని మీమ్స్, సెటైర్స్ వేశారో అందరికీ తెలిసిందే. తాజాగా వారిద్దరి ప్రసంగాన్ని కలిసి ఓ చక్కటి వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ వర్మ ఓ ట్వీట్ చేశాడు.

Ram Gopal Varma Wants To Marry Editor

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, మమ్ముట్టి కలిసి నటించిన దళపతి సినిమాలోని 'సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట' పాట తమిళ వర్షన్‌ను మోదీ, ట్రంప్ కలిసి పాడినట్టుగా ఓ వీడియోను ఎడిట్ చేశారు. దీనికిపై స్పందిస్తూ.. ఈ వీడియోను తయారు చేసిన ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే చేసుకుంటాడా? ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X