పాపులను శిక్షించడానికే కరోనావైరస్.. దేవుడిని ధిక్కిరిస్తున్నామని.. వర్మ సెటైర్లు

ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన కోరోనావైరస్‌ను ఉపయోగించుకొని దేవుడిపై, మతాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు సంధిస్తున్నారు. సందర్భం ఏదైనా తన ట్వీట్లకు అనుగుణంగా మలచుకోవడంలో దిట్టగా పేరున్న ఆర్జీవి ఇప్పుడు కరోనావైరస్‌పై ట్వీట్లు చేస్తూ ట్విట్టర్‌ను రఫ్ ఆడిస్తున్నారు. రాంగోపాల్ వర్మ చేసిన కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు ఇవే..

కరోనావైరస్‌పై ఆసక్తికరమైన ట్వీట్లు

కరోనావైరస్‌పై ఆసక్తికరమైన ట్వీట్లు

కరోనావైరస్‌ గురించి వర్మ ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తూ.. భగవంతుడు, కరోనావైరస్ సీక్రెట్‌గా అఫైర్ పెట్టుకొన్నట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే.. వారి లవ్ స్టోరీలో మానవులు విలన్లు కాబట్టి. అందుకే కరోనావైరస్‌కు దేవుడు సపోర్ట్‌గా నిలిచాడనే విధంగా వర్మ కామెంట్ చేశారు.

మతపెద్దలను ఆర్జీవి టార్గెట్

మతపెద్దలను ఆర్జీవి టార్గెట్

ఇక మరో ట్వీట్‌లో రాంగోపాల్ వర్మ మత పెద్దలను టార్గెట్ చేశారు. వైరస్‌లను దేవుడు ఎందుకు క్రియేట్ చేస్తారో ఏ మతపెద్దైనా వివరించగలరా? నాకు తెలిసిన జవాబు ఏమిటంటే.. పాపులను శిక్షించేందుకే దేవుడు వైరస్‌ను సృష్టించారు. మనమెందుకు పాపులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడు ఆదేశాలకు వ్యతిరేకంగా మనం వ్యవహరిస్తున్నట్టే కదా? అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కరోనానే స్వాగతించాలి

కరోనానే స్వాగతించాలి

కరోనాను ఏ మతం కూడా ఎదురించలేకపోయిందని రాంగోపాల్ వర్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనల్ని ఏ మతం కూడా కాపాడలేని పరిస్థితి ఉన్నప్పుడు.. కరోనా అనే మతాన్ని మనం స్వాగతిస్తే సరిపోతుంది కదా అంటూ మరో ట్వీట్ చేశారు.

Recommended Video

Vijay Devarakonda Tops Most Desirable Man 2019 | Ram Charan | Prabhas
దేవుడు చేసిన మనుషులే..

దేవుడు చేసిన మనుషులే..

దేవుడు చేసిన మనుషులే ఆలయాలను, మసీదులను, చర్చిలను కట్టారు. మళ్లీ ఇప్పుడు వారే దేవుడు సృష్టించిన వైరస్ కారణంగా వాటిని మూసేస్తున్నాడు. ప్రార్థనలు చేసుకోవడానికి మనకంటే వైరస్‌లే ఎక్కువ చర్చిలు, ఆలయాలు, మసీదులు సృష్టిస్తాయని నా భావన అని రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X