రిలీజైన తర్వాత నన్ను కొడతారేమో?: వర్మ

By Bojja Kumar

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో ఫుల్ కాంట్రవర్సీలతో కూడిన ఓ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే 'నా ఇష్టం" అనే ఓ పుస్తకాన్ని విడుదల చేసిన వర్మ అనేక విమర్శలు మూట గట్టుకున్నాడు. ఆ పుస్తకం చదవిన చాలా మంది వర్మ వెర్రి తనానికి ఆ పుస్తకం నిదర్శనమని మండి పడ్డారు కూడా.

'నాఇష్టం" పుస్తకం గురించి తెలుగు జనాలు ఇంకా మరిచి పోక ముందే మరో పుస్తకాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు వర్మ. బెజవాడ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ 'నా ఇష్టం" పుస్తకం తరహాలో మరో పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాను. ఆ పుస్తకం విడుదలైన తర్వాత కొంత మంది నన్ను కొడతారేమో? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి అంత వివాదాస్పందంగా ఉండే ఆ పుస్తకంలో ఏం ఉందంటే మాత్రం...అది పుస్తకం విడుదలైన తర్వాతే చదివి తెలుసుకోవాలని సస్పెన్స్ లో పెట్టాడు రామూజీ.

ఇక బెజవాడ సినిమా గురించి మాట్లాడుతూ తాను గతంలో తీసిన శివ సినిమాకు, బెజవాడ సినిమాకు సంబంధం ఉండదని....ఇది ప్రత్యేకంగా ఉంటుందన్నారు. నాగార్జున కంటే నాగ చైతన్యే నటనలో బెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X