For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV: ఇద్దరమ్మాయిలతో రామ్ గోపాల్ వర్మ హాట్ పిక్.. జాన్వీ కపూర్ లా ఉందంటూ!

  |

  సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీకే కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. కామెంట్స్, ట్వీట్స్ మాత్రమే కాకుండా వివాదస్పదైమైన చిత్రాలు తెరకెక్కించడం, వీడియోలు, ఫొటోలతో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటారు. ఇక ఆయన అప్పుడప్పుడూ అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటూ పెడుతూ ట్రిండింగ్ గా మారతారు. తాజాగా మరోసారి ఇద్దరమ్మాయిలతో కలిసి ఫొటోకు పోజు ఇవ్వడం వైరల్ అయింది.

  ప్రవర్తనలో మార్పులు..

  ప్రవర్తనలో మార్పులు..

  టాలీవుడ్‌లో గొప్ప గొప్ప చిత్రాలు చేసి అతి తక్కువ సమయంలోనే దేశంలోనే క్రేజీ అండ్ డిఫరెంట్ డైరెక్టర్‌గా పేరు సంపాదించాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. దాదాపు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. మరెవరికీ దక్కని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే, కొంత కాలంగా ఆయన ప్రవర్తనలో, శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆయన అమ్మాయిలతో రచ్చ చేసే విధానం ఆశ్చర్యపరుస్తోంది.

  హీరోయిన్లకు అదిరిపోయే ఫాలోయింగ్..

  హీరోయిన్లకు అదిరిపోయే ఫాలోయింగ్..

  రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే ఫాలోయింగ్ దక్కుతూ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన కేవలం అమ్మాయిలనే హైలైట్ చేసే సినిమాలు తీస్తున్నాడు. ఇందులో భాగంగానే 'జీఎస్టీ', 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటిలో కొన్ని థియేటర్లలో విడుదల చేయగా మరికొన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకు వచ్చాడు.

  వాళ్లతో బోల్డ్ ఇంటర్వ్యూలు..

  వాళ్లతో బోల్డ్ ఇంటర్వ్యూలు..

  ఇదిలా ఉంటే రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తోన్న శైలి అందరికీ షాకిస్తోంది. అంతలా ఆయన రచ్చ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సంచలన దర్శకుడు.. కొందరు హీరోయిన్లతో కలిసి పార్టీలు చేసుకుంటూ క్రేజ్ సంపాదిస్తున్నాడు. వారిలో అప్సరా రాణి, నైనా గంగూలీ, పూజా భలేకర్ వంటి వారు ఉన్నారు. ఇక బిగ్ బాస్ బ్యూటీలు అషు రెడ్డి, ఆరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ షాక్ ఇస్తున్నాడు.

  ఆర్జీవీపై ట్రోలింగ్..

  ఆర్జీవీపై ట్రోలింగ్..

  ఇటీవల డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అషు రెడ్డితో ఓ ఇంటర్వ్యూ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంటర్వ్యూ చివరిలో అషు రెడ్డి పాదాలకు చాలా ఘాటుగా ముద్దు పెట్టాడు ఆర్జీవీ. అంతేకాకుండా ఆమె కాలి బొటన వేలిని చీకారు కూడా. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన కొంతమంది ఆర్జీవీపై విమర్శలు సంధిస్తూ విరుచుకుపడ్డారు. వారందరికీ మరో వీడియా ద్వార వివరణ కూడా ఇచ్చారు ఆర్జీవి.

  అందమైన ముద్దుగుమ్మలతో..

  అందమైన ముద్దుగుమ్మలతో..

  ఇక ఆర్జీవీ అందమైన ముద్దుగుమ్మలను వెంట వేసుకుని పార్టీలలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకు అనేకమంది అమ్మాయిలతో పబ్బుల్లో, పార్టీల్లో రామ్ గోపాల్ వర్మతో దిగి క్రేజ్ సంపాదించుకున్నవారు ఉన్నారు. అందులో బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా ఒకరు. అలాగే ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి అరియానా పాపులారిటీ పొందింది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఇద్దరు అమ్మాయిలతో పోజు ఇచ్చిన ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆర్జీవి.

  అతికొద్ది సమయంలో వైరల్ గా..

  అతికొద్ది సమయంలో వైరల్ గా..

  ఇందులో ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి భుజాలపై చేతులు వేసి స్మైల్ ఇవ్వగా.. అటువైపు మరో అమ్మాయి ఉంది. ఫొటోలో వీరిద్దరిని పట్టుకుని ఆర్జీవి పోజు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. "ప్రిజమ్ పబ్ లో మెరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్" అని క్యాప్షన్ రాస్తూ ఈ ఫొటోను షేర్ చేశాడు ఆర్జీవి. షేర్ చేసిన అతికొద్ది సమయంలో వైరల్ గా మారింది. దీంతో ఈ పిక్ పై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

  మీ మీద చేతబడి చేయిస్తాం..

  "నీ పని బాగుందన్నా" అని ఒక నెటిజన్ అంటే.. ఆమె (ఆరెంజ్ కలర్ డ్రెస్) జాన్వీ కపూర్ కాదు గా" అని మరొకరు కామెంట్ చేశారు. అలాగే ఇంకొకరు "లైట్ గా జాన్వీ కపూర్ లా ఉంది" అని కామెంట్ చేశారు. "మీ మీద చేతబడి చేపిస్తాం" అని మరొకరు తమ అభిప్రాయాన్ని తెలిపారు. "లైఫ్ అంటే మీది సార్" అంటూ పలువురు రామ్ గోపాల్ వర్మను కొనియాడుతున్నారు. ఇలా కామెంట్లతో ఆర్జీవీ లేటెస్ట్ పిక్ హాట్ టాపిక్ గా మారిపోయింది.

  English summary
  Sensational Director Ram Gopal Varma Shares A Photo With Two Girls And Netizens Says One Of The Girl Looks Like Bollywood Heroine Janhvi Kapoor
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X