twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవీ మందు గోల.. మొన్న అలా నేడు ఇలా.. ట్వీట్లతో అభ్యర్థన

    |

    మందు షాపులు తెరవకపోవడం, అందుబాటులో మందు లేకపోవడంతో ఆర్జీవీ కిందామీదా అవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే అలాంటి స్థితిలో కేవలం ఆర్జీవీ మాత్రమే కాదు.. ఎందరో మందుబాబులుంటారు. మందు దొరక్కా ఏం చేయాలో తెలియక.. ఇంట్లోనే ఆల్కహాల్‌ను ఎలా తయారు చేయాలో గూగుల్ తల్లినే అడిగేస్తున్నారంటే విషయం ఎక్కడి వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే విషయమై వర్మ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. సందు దొరికినప్పుడల్లా ప్రభుత్వానికి, నాయకులకు మందు ఆవశ్యకత గురించి చెబుతూ.. మందుబాబులా గురించి ఆలోచించండని సలహాలు ఇస్తున్నాడు.

    కేటీఆర్‌ను రిక్వెస్ట్..

    కేటీఆర్‌ను రిక్వెస్ట్..


    ‘ఇళ్లల్లో ఉంటున్న వాళ్లు ఏం చేయాలో తెలియక జట్టు పీక్కుంటున్నారు. చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారు. మెంటల్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఫస్ట్రేషన్ లో కొందరు భర్తలు భార్యల్ని కొడుతున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతలా పెద్ద మనసు చేసుకొని మాకు చీర్స్ చెప్పండ'ని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

    కేసీఆర్‌కు వర్మ ఛాలెంజ్

    కేసీఆర్‌కు వర్మ ఛాలెంజ్

    పిచ్చి పీక్స్‌కు వెళ్లినట్టుగా కేసీఆర్‌కు వర్మ వింత ఛాలెంజ్‌ను విసిరాడు. ‘లాక్‌డౌన్ పిరియడ్‌లో కేసీఆర్‌గారిని ప్రెస్ మీట్‌‌లో అందరిముందూ ఒక గ్లాస్ విస్కీ తాగాలని చాలెంజ్ చేస్తున్నాను. దీనికి కారణం ఉంది. తెలంగాణలో చాలా మంది మందు దొరక్క చనిపోతున్నారు. అందరూ కుళ్లుకుని చచ్చిపోయేలా కేసీఆర్ వీస్కీ తాగాలన్నది నా చాలెంజ్'అని ట్వీట్ చేశాడు ఆ మధ్య.

    ఆ రెండింటికి సంబంధం లేదు..

    ఆ రెండింటికి సంబంధం లేదు..

    మందు లేక ఎంతో మంది డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు.. ఈ వాస్తవాన్ని నాయకులు తెలుసుకోవాలి.. ఇంట్లో జరిగే గొడవలతో నమ్మశక్యం కాని కోపం వస్తోంది.. పైగా ప్రభుత్వంపై కూడా కోపం వస్తుంది.. ఎందుకుంటే.. కరోనాకు ఆల్కహాల్‌కు ఎలాంటి సంబంధం లేద'ని ట్వీట్ చేశాడు.

    Recommended Video

    #Betherealman: Why Mahesh Babu, Pawan Kalyan, Prabhas Are Not In Challenge ?

    ఎంత డబ్బు పెట్టైనా కొంటారు..


    మనం ఏదైనా కట్టడి చేస్తున్నామంటే.. బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నట్టే.. దీంతో రేట్లు పెరుగుతాయి.. దీనివల్ల కనీస అవసరాలకు వాడుకునే డబ్బును కూడా కచ్చితంగా కావాలనుకునే ఆల్కహాల్ కోసమే వాడుతార'ని ట్వీట్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే మందు దొరక్క వర్మ కూడా అల్లాడిపోతోన్నట్టు కనిపిస్తోంది.

    English summary
    Ram Gopal Varma Worried Alcohol In Covid 19 Pandemic. Restricting anything which people want will only encourage the black market to shoot up prices which will result in people using the stimulus money to buy their desperately needed alcohol at a far higher price thus depriving their families of other necessities
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X