అందులో ఆ పన్నాగాలు, అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్‌.. బయోపిక్‌తో తనపై తానే సెటైర్ వేసుకోబోతోన్న వర్మ!

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడేం చేస్తాడో చెప్పడం కష్టం. ఎప్పుడూ ఎదుటివారిపై, వారి వ్యక్తిత్వాలపై కామెంట్ చేస్తూ సినిమాలను తీసే వర్మ ఈ సారి పంథా మార్చాడు. తనపై తానే సెటైర్ వేసుకునేందుకు ఆర్జీవీ రాబోతోన్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం వర్మ ఇప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేశాడు. టైటిల్ పోస్టర్‌తోనే ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశాడు. ఒక్కో ట్వీట్‌తో ఒక్కో సంచలనం రేపుతున్నాడు. ఈ సినిమాను మూడు పార్ట్‌లో తీస్తాననని పేర్కొన్నాడు. ఇక ఇందులో ఏమేమీ ఉండబోతోన్నాయన్నది కూడా వివరించాడు.

మూడు భాగాల్లో RAMU..

మూడు భాగాల్లో RAMU..

బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ , నా నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే 3 చిత్రాలుగా నిర్మించబోతోంది. బొమ్మాకు మురళి నిర్మాణంలో నా ఆధ్వర్యంలో "దొరసాయి తేజ" ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతోన్నాడు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు కాబోతోందని వర్మ ప్రకటించాడు.

నిడివి కూడా..

నిడివి కూడా..


ఆర్జీవీ బయోపిక్‌గా తెరకెక్కబోతోన్న రాము చిత్రం నిడివి గురించి తెలిపాడు. నా బయోపిక్ 3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది అంటే 3 చిత్రాలు కలిపి 6 గంటలు. ఇక వరుసగా ట్వీట్లు చేస్తూ ఒక్కో పార్ట్‌లో ఏ ఏ సంఘటనలుంటాయో కూడా వర్మ తెలిపాడు.

మూడు పార్టుల్లో..

మూడు పార్టుల్లో..

రామ్ గోపాల్ వర్మ అంటే అందరికీ తెలిసింది శివ సినిమాతోనే. అందుకే ఈ మొదటి పార్ట్‌లో శివకు ముందు వర్మ జీవితం ఎలా ఉండేదో చూపించబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు నా వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతోందని వర్మ పేర్కొన్నాడు.

పన్నాగాలు..

పన్నాగాలు..

పార్ట్ 1 లో నా 20 ఏళ్ళప్పుడు రోల్ ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే న గా నటించబోతున్నా.పార్ట్ 1 "రాము " దీంట్లో నా కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నానన్నది తాను చూపించబోతోన్నట్టు వర్మ తెలిపాడు.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
ప్రేమాయణం, వివాదాలు..

ప్రేమాయణం, వివాదాలు..

పార్ట్ 2 "రామ్ గోపాల్ వర్మ" -అండర్ వరల్డ్ తో ప్రేమాయణం. ఇది నా ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి. పార్ట్ 3 "RGV"
-ది ఇంటెలిజెంట్ ఇడియట్ . ఇది నా ఫేయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి. అంటూ ఆర్జీవీ ట్వీట్స్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X