Animal Review... మీ ఇద్దరి షూస్ నాకాలని ఉంది... RGV ఏంట్రా ఇలా అనేశాడు?
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన చిత్రం యానిమల్. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. రెండు రోజుల్లోనే 232 కోట్ల రూపాయలు వసూలు చేసి.. రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓ ఊపు ఊపేస్తుంది. క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఎన్నడూ లేని విధంగా రామ్ గోపాల్ వర్మ ఓ సుదీర్ఘ పోస్టును తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఏకంగా యానిమల్ సినిమాపై నా రివ్యూ అంటూ పోస్ట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. ఇక తాజాగా ఆయన యానిమల్ సినిమా చూశారట. ఇక ఆ సినిమాపై తనదైన శైలీలో ప్రశంసలు కురిపిస్తూ.. సంచలన రివ్యూ ఇచ్చాడు. తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ఆ రివ్యూలో ఏం రాసుకువచ్చాడంటే.... యానిమల్ సినిమా మీద రాసిన చాలా రివ్యూలు చూసి, చదివిన తర్వాతే నేను సినిమాకి వెళ్ళాను. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా సినిమాలు తీసిన తర్వాత నేను కేవలం ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఏ సినిమాని చూడలేను. అందుకే ఈ సినిమాని వేరు వేరు కోణాల్లోచూడాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను... అంటూ రాసుకువచ్చాడు.

ఆ సుదీర్ఘ పోస్టులో ఆర్జీవీ... ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూ లో ఏమన్నాడంటే... సినిమా అన్నది ప్రేక్షకుడికి నచ్చిందా? నచ్చలేదా? అన్నంత సింపుల్ గా ఉండకూడదు.. ఆ సినిమా చర్చించుకునే విధంగా ఉండాలి. ఒక కొత్త తర్కానికి తెర తీయాలి.... అదే సందేశం.. సందీప్ వంగ యానిమాల్ చిత్రంతో వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు.. బాక్సాఫీస్ రన్ ముగిసిన తర్వాత చాలా సంవత్సరాల వరకూ కూడా యానిమల్ సినిమాకి సంభందించిన వాదనలు, తర్కాలు కొనసాగుతాయి.. అంటూ రాసుకువచ్చాడు.
అంతే కాకుండా... ఈ సినిమా హిపోక్రిసీ బట్టలిప్పదీసి పూర్తి నగ్నమైన నిజాయితీనీ విశ్వరూపంతో చూపించడంతో ఎంతో కొంత మన సంస్కృతిని కూడా మార్చిపారేస్తుంది. అది నా నమ్మకం. ఎందుకంటే యానిమల్ అనేది ఒక సినిమా కాదు .. అది ఒక సోషల్ స్టేట్మెంటు. నాకు ఆ సినిమా కథ కానీ... తండ్రి కొడుకుల బంధం కానీ ఏమంత ఎక్కలేదు. కానీ బాగా ఎక్కిందేంటంటే అలాంటి పాత కథా వస్తువుల్ని బేస్ గా చేసుకుంటూ సందీప్ మునుపెన్నడూ చూడని సీన్లని అద్భుతంగా చూపించడం.. అంటూ వెల్లడించాడు.
సినిమా అంటే ఇలాగే వుండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు సందీప్. వాళ్ళు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త కుండీలో పడేసాడు. యానిమల్ సినిమా స్లోగా ఉన్నప్పటికీ చాలా సార్లు మనం షాక్ అవుతాము.. దానికి కారణం సినిమా స్లోగా ఉండటమే అని తర్వాత తెలుసుకుంటాము.. నా ఉద్దేశ్యంలో ఈ సినిమా మూడున్నర గంటలు కాకుండా నాలుగున్నర గంటలున్నా తక్కువే.. అంటూ తెలిపారు.
ఒక సీన్ లో హీరో వెళ్లి బేస్ బాల్ బ్యాటో అలాంటిదేదో పట్టుకుని వస్తాడేమో అని నాతో పాటు అందరూ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలొ మెషీన్ గన్ తో రావటం అన్నది థియేటర్ లో మా అందరినీ కుర్చీలో నుంచి కింద పడేంత ఎఫెక్ట్ ఇచ్చింది. "హ్యాపీనెస్ ఈజ్ ఎ డెసిషన్" అని రణబీర్ సింపుల్ గా చెప్పిన డైలాగ్ తత్వవేత్తలందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది... అని తన అభిప్రాయన్ని చెప్పుకువచ్చారు.
ట్రెడిషనల్ సినిమా రూల్స్ ని కడుపులో గుద్దుతూ... తన కాళ్లతో తన్నినందుకు సందీప్ ను జీర్ణించుకోలేక, కడుపు నొప్పతో నేల మీద పడి దొర్లడం తప్ప విమర్శకులు ఇంకేం చెయ్యలేరు. నిజాన్ని దుమ్ము దులిపేసి దాని అసలు రూపాన్ని ఏ మాత్రం కలరింగ్ లేకుండా నిజంగా చూపించిన ఒక నిజమైన కళాకారుడు సందీప్. దీనికి ఉదాహరణగా అక్కడక్కడా వచ్చే కామిక్ సన్నివేశాల్లో ఉదాహరణకి, బ్రా స్ట్రాప్ స్పాంకింగ్, సెక్స్ గురించి డాక్టర్ లతో మాట్లాడుతున్నప్పుడు లాంటివి చెప్పుకోవచ్చు... అంటూ పచ్చిగా రాసుకువచ్చాడు.
ఒక్క మాటాలో చెప్పాలంటే... సందీప్ దగ్గర అసిస్టెంట్ గా చేరాలని ఉందంటూ ఆర్జీవీ చెప్పుకువచ్చారు. ఒక సీన్ లో కండోమ్ వాడావా? అని హీరోని రష్మిక అడిగే సీనూ, అది రాసిన, తీసిన తీరు అద్భుతం... రష్మీక నటనకు నేను క్లీన్ బౌల్డ్ అనే చెప్పాలి అంటూ చెప్పుకువచ్చాడు. సందీప్ దయచేసి నీ కాళ్ళ ఫోటో నాకు వాట్సాప్ లో పంపిస్తే మొక్కుకుంటాను అని వెల్లడించాడు.
నేను ముందే చెప్పినట్టు , ఆ అమ్మాయిని షూ నాకమని నువ్వు రణబీర్ తో చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా.. అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రన్బీర్ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను అంటూ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











