గాంధీజీపై రామ్ గోపాల్ వర్మ వల్గర్ కామెంట్స్
ముంబై: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జాతిపిత మహాత్మా గాంధీజీపై ట్విట్టర్లో వల్గర్ కామెంట్స్ చేసాడు. వివాదాలతో పబ్లిసిటీ సంపాదించుకుందామనే మనస్తత్వం గల వర్మ ఈ సరి మరింత నీచంగా ప్రవర్తించాడు. గాంధీజీ చెడు చూడకు, చెడు వినకు, చెమాట్లాడకు అన్నారు. వర్మ చేసిన కామెంట్స్ చెడ్డవే అయినా....... వీటిని పాఠకుల దృష్టికి తేవడం ద్వారా వర్మకు బుద్ది చెబుతారనే ఉద్దేశ్యంతో వాటిని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. వర్మ లాంటి వాళ్లను చూస్తూ ఊరుకుంటే మరింత రెచ్చిపోతారు.
వర్మ ట్విట్టర్లో చేసిన వల్గర్ కామెంట్స్
1. గాంధీజీ తండ్రి దండ్రులు సె------ చేసుకోవడం ద్వారా మనకు గాంధీజీ లభించినందుకు సంతోషిస్తున్నాను. వాళ్లు సె---- చేసుకోకపోతే మన పూర్ ఇండియన్స్ ఇంకా బ్రిటిష్ వారి పాలనలోనే ఉండే వాళ్లం.
2. గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే..... ఆయన తండ్రి గ్రాండ్ ఫాదర్ ఆఫ్ నేషనా?
3. గ్రాండ్ మదర్ ఆఫ్ నేషన్ పేరు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి.
4. మదర ఆఫ్ నేషన్ ఎవరు?
ఇలాంటి చెత్త కామెంట్స్ చాలానే చేసాడు వర్మ. దేశ విదేశాల్లో గాంధీజీని మహాత్ముడిగా పొగుడుతుంటే.... భారతీయుడు అయిన రామ్ గోపాల్ వర్మ ఆయనపై ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేయడం దురదృష్టకరం. వర్మ లాంటి వ్యక్తుల నోటి దూలకు అడ్డుకట్ట వేసేవారు ఎవరో..?


Click it and Unblock the Notifications












