‘కందిరీగ’ ఆడియో ఆవిష్కరించిన విక్టరి వెంటష్

By Sindhu

రామ్ హీరోగా, హన్సిక హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం 'కందిరీగ'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న రాత్రి తాజ్ డెక్కన్ హొటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వెంకటేష్, గోపిచంద్, వి.వి.వినాయక్, స్రవంతిరవికిషోర్, మలినేని గొపిచంద్, మల్టి డైమన్షన్ రజిత్ పార్ధసారధి, పి.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సిడిలను విక్టరి వెంకటేష్ ఆవిష్కరించి తోలి ప్రతిని గొపిచంద్, వివి వినాయక్‌కు అందచేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, రామ్ మంచి ఎనర్జీ ఉన్న హీరో తనకు కరెక్ట్ సినిమా 'కందిరీగ'. సంతోష్ శ్రీనివాస్ మంచి మాస్ దర్శకుడుగా ఎదుగుతాడు. ఈ సినిమా ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అవ్వాలని అన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ, బెల్లంకొండ సురేష్ గారు చాల స్విట్ పర్సన్. మా టీమ్‌ కి కొండంత అండగా నిలిచారు. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. 'జగడం' తర్వాత పదిహేను నెలలు విరామం తీసుకొని 'రెడీ' చేశాను. ఆ చిత్రం పెద్ద హిట్. అలాగే ఈ సినిమా 'రామరామ కృష్ణకృష్ణ ' తర్వాత అంతే గ్యాప్ తీసుకొని చేశాను. ఈ సినిమా కూడ పెద్ద హిట్ అవుతుందని, ఇందులొ పని చేసిన వారందరికి మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X