»   » రామ్-హన్సికలతో గోపీచంద్ మలినేని ‘పండగ చేస్కో’

రామ్-హన్సికలతో గోపీచంద్ మలినేని ‘పండగ చేస్కో’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'సింహా' నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్టెనర్ కు 'పండగ చేస్కో' టైటిల్ కన్‌ఫర్మ్ చేసారు.

రామ్ సరసన మస్కా, కందిరీగ వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అందాల తార హన్సిక ఈ చిత్రంలో మళ్లీ రామ్ తో జతకట్టబోతోంది. రామ్, హన్సిక కాంబినేషన్‌లో ఇది హాట్రిక్ ఫిలిం అవుతుంది. ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం అయ్యే 'పండగ చేస్కో' కోసం మేలో అమెరికాలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

Pandaga Chesko

ఈ చిత్రం గురించి డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ...'డాన్ శీను, బాడీగార్డ్, బలుపు వంటి హిట్ చిత్రాల తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా హీరో క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టెనర్‌గా రూపొందే ఈ చిత్రానికి 'పండగ చేస్కో' టైటిల్ హండ్రెడ్ పర్సంట్ సూటవుతుందని ఖరారు చేసా అన్నారు.

రామ్, హన్సిక కాంబినేషన్‌లో ఇది మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. 'సింహా' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యునైటెడ్ మూవీస్ బేనర్లో 'పండగ చేస్కో' చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు' అన్నారు.

English summary
Ram and Hansika are going to team up once again for an upcoming Telugu film titled ‘Pandaga Chesko’. Gopichand Malineni is going to direct the film and Parachuri Prasad is producing it under United Movies banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu