సురేంద్ర రెడ్డి, రామ్ కాంబినేషన్ వెరైటీ టైటిల్
రామ్, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం ఓకే అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి టామ్ అండ్ జెర్రి అనే వెరైటీ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. డిస్నీ వారి టామ్ అండ్ జెర్రీ బాగా పాపులర్ అవటంతో అన్ని వర్గాలను ఆకట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ,మాటలు అందించనున్నారు. అశోక్ నుండీ వక్కంతం కథతోనే సురేంద్రరెడ్డి ముందుకు సాగుతున్నారు. కిక్ చిత్రంలాగే ఈ సినిమా కూడా ఫుల్ లెంగ్త్ కామీడీతో నడవనుందని తెలుస్తోంది. జనవరి నుంచీ ఈ చిత్రం సెట్స్ కు వెళ్ళనుంది. ఇక స్రవంతి బ్యానర్ లో రామ్ హీరోగా గణేష్ అనే చిత్రం తీసారు..భాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం నెగిటివ్ ఫలితాన్ని నమోదు చేసింది.
రామ్ ఇలియానా దేవదాసు వైవియస్ చౌదరి కిక్ సురేంద్ర రెడ్డి అశోక్ అతిధి మహేష్ పవన్ కళ్యాణ్ ram ileana devadas yvs chowdary kick surendra reddy athidi


Click it and Unblock the Notifications