ఆడాళ్ళ పనిలో రామ్
రామ్ త్వరలో ఆడవాళ్ళకు మాత్రమే బట్టలు డిజైన్ చేసే పనిలో బిజీ కానున్నాడు. ఎనభైల్లో వంశి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. అయితే ఈ సారి లేడీస్ టైలర్ కాస్తా సిటీల్లో ఉండే ఫ్యాషన్ డిజైనర్ గా మారనున్నాడు. ఈ ఫ్యాషన్ డిజైనర్..లేడీస్ కి బట్టలు డిజైన్ చేయటం, వారితో తగువులు, ప్రేమలుతో తలనొప్పులు తెచ్చుకుని నవ్వులు పండిస్తాడంటున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మించనున్న ఈ చిత్రానికి చాలా కాలం తర్వాత తణికెళ్ళ భరణి సైతం స్క్రిప్టు ని అందించే అవకాశాలన్నాయని చెప్తున్నారు. ఇక టైటిల్ కూడా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ అని పెడుతున్నారు. రాజేంధ్రప్రసాద్ ని కూడా గెస్ట్ రోల్ లో అడుగుదామనే ఆలోచనలో ఉన్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ స్క్రిప్టు తయారు చేస్తున్నారు. మొదట ఈ కథతో రవితేజ హీరోగా సినిమా చేస్తారని మొదట ప్రచారం జరిగింది. ప్రస్తుతం వంశి గోపి..గోపిక..గోదావరి టైటిల్ తో కమిలిని ముఖర్జీ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











