హీరో ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోయింది ఎందుకంటే ‘ప్రేమంటే’
రామ్-తమన్నా జంటగా నటిస్తోన్న 'ఎందుకంటే ప్రేమంటా" చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతోంది. ఇటీవలే కొన్ని సీన్స్ పారిస్ లోనూ, ఈఫిల్ టవర్ వద్ద చిత్రీకరించారు. ఈ భారీ షెడ్యూల్లోనే మరో సాంగ్ కూడా చిత్రీకరించనున్నారు. వీటితో తోపాటు పీటర్ హెయిన్స్ సారధ్యంలో కొన్ని ఫైటింగ్ సీన్స్ ని స్టైలిష్ గా షూట్ చేస్తున్నారట. అంతేకాదు రామ్ తమన్నా మధ్య ఉండే లవ్ ట్రాక్ ను సైతం ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ ఈ సినిమాను తనదైన స్క్రీన్ ప్లేతో తీర్చిదిద్దుతున్నాడని నిర్మాతలంటున్నారు. స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనకాడకుండా లావిష్ గా నిర్మిస్తున్నారు. జెనీవా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ తో పాటు హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. జివి ప్రకాష్ సంగీతం ఈ సినిమాకు మరో అస్సెట్ గా నిలవనుంది. కోన వెంకట్ ఈ సినిమాకు కథ అందించటమే కాకుండా.... ప్రతినాయకుని పాత్రనూ పోషిస్తుండటం విశేషం.
కాగా కందిరీగ' 100 రోజుల సినిమా అవడంతో హీరో రామ్ మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. అందుకే మంగళవారం (నవంబర్ 22న) మీడియావాళ్లకి లంచ్ పార్టీ ఇచ్చాడు. పైకి ఇది క్యాజువల్ పార్టీ. 'కందిరీగ' 100 రోజులు ఆడినందుకు ఇస్తున్న లంచ్ కాదు అని చెప్పినప్పటికీ 'కందిరీగ' గురించి ప్రస్తావించినప్పుడు అతని మొహం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోయింది. 'రెడీ' తర్వాత మూడు సినిమాలు సరిగా ఆడకపోయేసరికి అతను నిరాశ చెందినమాట వాస్తవం. 'కందిరీగ' అతనిలో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహంతోటే ఇప్పుడు 'ఎందుకంటే ప్రేమంట' సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పట్ల ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తున్న ఆసక్తి చూస్తుంటే రామ్ తనదైన మార్కెట్ ని సొంతం చేసుకున్నాడని చెప్పడంలో తప్పేమీ లేదు. అయితే ఆ మార్కెట్ ని అతను ఎంతకాలం నిలుపుకుంటాడనేది అతను చేసే సినిమాల మీద ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications











