Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హండ్రెడ్ డేస్ దిశగా పరుగులు తీస్తున్న హనీబీ...!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మల్టీ డైమెన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ఫ్రై.లిమిటెడ్ సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్, గణేష్ బాబు నిర్మించిన కందిరీగ" దిగ్విజయంగా అన్ని కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ 'కందిరీగ" చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించి పెద్ద హిట్ చేసారు. మా బేనర్ లో, రామ్ కెరీర్ లో ఇది సూపర్ హిట్ చిత్రంగా నిలిచి శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. అన్ని సెంటర్స్ లో ఈ చిత్రం 50రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను"అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి మహేంద్రబాబు మాట్లాడుతూ 'రామ్ హన్సిక, అక్షలతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తీసిన 'కందిరీగ" చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి కారకులైన యూనిట్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అన్నారు.