For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబ్బున్న ఆడవాళ్లతో స్నేహం...హీరో రామ్ కు మెసేజ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఫోన్ నెట్ వర్క్ వాళ్లు పంపే ఎడ్వర్టైజ్మెంట్ లు ఎలా ఉంటాయో..ఎలాంటి యాడ్ లు సైతం ఇప్పుడు ప్రమోట్ అవుతున్నాయో తెలుసుకోవటానికి చిన్న ఉదాహరణ ఇది. హీరో రామ్ కు ఈ క్రింద చూపుతున్న ఫొటో యాడ్ వచ్చింది. అందులో రియల్ ప్రెండ్ షిప్ పాయింట్..హై ఫ్రొఫైల్ రిచ్ ఫిమేల్స్ లో స్నేహం చెయ్యండి..డబ్బు సంపాదించండి అని ఉంది. అది చూసి నవ్వుకున్న రామ్ దీన్ని స్కీన్ షాట్ తీసి ఇలా ట్వీట్ చేసాడు. రామ్ ఈ విషయమై రాస్తూ...ఇలాంటివి లీగల్ గా ఉండి యాడ్ లు వస్తు్న్నాయా అన్నట్లు ఆశ్యర్యపోయారు.

  తెరపై అతని జోరు చూస్తుంటే 'ఆ వయసులో మనం అలా ఎందుకు లేం' అనిపిస్తుంటుంది. పద్నాలుగు రీళ్లలో పట్టుమని పది సెకన్లు కూడా దిగాలుగా మొహం పెట్టడం కనిపించదు. ఆ తీరే ప్రేక్షకులకు నచ్చింది. 'దేవదాస్‌', 'జగడం', 'మస్కా', 'కందిరీగ'... ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగాడు. నటన, డ్యాన్సులు, పోరాటాలూ, స్త్టెలింగ్‌.. ఇలా అన్నిటా తనదైన సొంత ముద్ర చూపించుకొన్నాడు. ఇప్పుడు 'పండగ చేస్కో'సినిమాతో మరోసారి వినోదాలు పంచబోతున్నాడు.

  Ram Laughs At Rich Females Message

  ప్రస్తుతం చేస్తున్న చిత్రం విషయానికి వస్తే..

  రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పండగ చేస్కో' . రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాయకానాయికలు, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు.

  రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా యూనిట్ ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

  ''ఇక్కడ చదివి విదేశాల్లో నాలుగు డాలర్లు సంపాదించుకోవడానికి యువత విదేశాలకు వెళ్లిపోతున్న రోజులివి. ఇలాంటి సమయంలో విదేశాల్లో కోట్లు సంపాదించిన ఓ యువకుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తన వారి శ్రేయస్సు కోసం ఎలా పోరాడాడు అనేదే చిత్రం'' అన్నారు కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌.

  రామ్ తో చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు పరుచూరి ప్రసాద్‌.

  చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌.

  English summary
  Ram received an anonymous 'advertisement' message on his phone, which shocked him and made him laugh like anything. Sharing the print-screen of his phone, he expressed a surprise about the legality of the message.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X