Ram Mandir Inauguration Live: అయోధ్యకు చేరుకొన్న పవన్ కల్యాణ్.. ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?
500 ఏళ్ల భారతీయల కల సాకారం కాబోతున్నది. కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థానంలో రామమందిర నిర్మాణం చేపట్టి ఆ పవిత్ర ఆలయాన్ని అట్టహాసంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ వేడుక కోసం దేశ నలుమూలల నుంచి రామ, హనుమాన్ భక్తులు లక్షలాది మంది తరలి వచ్చారు. దేశంలోని సినీ ప్రముఖులు కూడా భారీగా అక్కడికి చేరుకొన్నారు. ఈ సంబురం విశేషాల ఎప్పటికప్పుడూ మీ కోసం..
Recommended Video

సోమవారం ఉదయం బేగంపేట నుంచి బయలు దేరిన రాచంరణ్, చిరంజీవి, సురేఖ అయోధ్య విమానాశ్రాయానికి చేరుకొన్నారు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.

అయోధ్యంలో రామ మందిర ప్రారంభం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అర్ధరాత్రి అయోధ్యకు చేరుకొన్నారు. సోమవారం ఉదయమే వాహనంలో రామ మందిరం వద్దకు వెళ్తూ కనిపించారు. ఈ వీడియో మీడియాలో వైరల్ అయింది.
రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందడంతో అయోధ్యకు వెళ్లాలని ఏర్పాట్లు చేస్తున్న చిరంజీవి, రాంచరణ్ నివాసానికి మెగా ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అభిమానుల కోలాహలం హై ఎనర్జీగా మారింది. తన అభిమానులను ఉద్దేశించి చిరంజీవి, రాంచరణ్ మాట్లాడారు. ఫ్యాన్స్ ఇచ్చిన రామ పటాలను స్వీకరించారు.
సోమవారం ఉదయమే రామమందిర ప్రారంభోత్సవానికి బేగంపేట విమానాశ్రయం నుంచి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రాంచరణ్, నిర్మాత వెంకట సతీష్ కిలారు బయలుదేరి వెళ్లారు.
రాముడి కోసం ప్రభాస్ ఫ్యాన్స్
- అయోధ్యంలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భీమవరంలో ప్రభాస్ అభిమానులు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 5000 మందికి అన్నదానం చేయాలని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
- మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆలయ ప్రాంగణానికి చేరుకొన్నారు. ఆలయం వద్ద వారిద్దరూ అనిల్ అంబానీతో కలిసి ముచ్చటిస్తూ కనిపించారు.
అయోధ్యలో టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో కలిసి రాంచరణ్, చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కనిపించారు. సోషల్ మీడియాలో వీరి ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి.
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా శ్రీ రామజన్మ భూమి ఆలయంలో రామ్ సియా రామ్ అనే పాటను సింగర్ సోను నిగమ్ ఆలపించారు.
క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శ్రీ రామజన్మ భూమి ఆలయం వద్దకు చేరుకొన్నారు. ఆయనకు అధికారుల, ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా శ్రీ రామజన్మ భూమి ఆలయం వద్దకు సూపర్ స్టార్ రజనీకాంత్ చేరుకొన్నారు. ఆయనకు కమిటీ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా అభివాదం చేశారు.
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా శ్రీ రామజన్మ భూమి ఆలయం వద్ద జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, వికీ కౌశల్, కత్రినా కైఫ్ తదితర బాలీవుడ్ ప్రముఖులు చేరుకొన్నారు.
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు హీరో అభిషేక్ బచ్చన్ ఆలయ ప్రాంగణానికి చేరుకొన్నారు. వారికి కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.


Click it and Unblock the Notifications











