»   » ‘శ్రీవిష్ణు అయితే ఆశ.. బాలయ్య అనుకుంటే అత్యాశ’

‘శ్రీవిష్ణు అయితే ఆశ.. బాలయ్య అనుకుంటే అత్యాశ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హరి హర చలన చిత్ర పతాకం పై ఈ నెల 6న విడుదలైన చిత్రం " ఇంతలో ఎన్నెన్ని వింతలో" ఈ చిత్రం విడుదలై 2వ వారం లోకి అడుగుపెటింది. ఇప్పటికి అన్ని చోట్లా ప్రేక్షదారణ పొందుతుంది. ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు ఇప్పిలి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి మాట్లాడారు.

మా హరి హర చలనచిత్ర బ్యానర్ లో మొదటి చిత్రం "ఇంతలో ఎన్నెన్ని వింతలో" హిట్ ని మేము ఇంతగా ఎంజాయ్ చేస్తున్నాము, అంటే దానికి ముఖ్య కారణం మా మీడియా మిత్రులే అని నిస్సందేహం గా చెప్పుకొంటాము. మీరు అందరూ మీడియా ప్రీమియర్ షో కి వచ్చి మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్సు ఇవ్వడం, సినీయర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు మా సినిమా పూర్తిగా చూసి మా యూనిట్ ని ఆశీర్వదించడం మాకు అతి పేద్ద కంప్లిమెంట్ గా భావించము. పసుపులేటి రామారావు గారిలాంటి పెద్దల ఆశీర్వాదాలు మా యూనిట్ కి ఎప్పుడూ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాము అని నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి అన్నారు.

సినిమాలు అంటే ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము. మాకు ఈ చిత్ర విజయం తో మాకు సినిమా పట్ల ఉన్న ఇష్టం మరింత పెరిగింది. మంచి సినిమాను తీస్తే మీడియా సపోర్ట్, అలానే ప్రేక్షకుల నుండి ఫ్రెండ్స్ నుండి ఇంత రెస్పాన్స్ వస్తున్నందుకు మాకు చాలా సంతషం గా ఉంది.
ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేను.మా చిత్రం ఇప్పటికీ థియేటర్స్ సంఖ్య పెరుగుతున్నాయి అని రామ్మోహన్‌రావు తెలిపారు.

Ram Mohan Rao Ippili

ఈ ఆనందాన్ని మీడియాతో పంచుకోడం కోసం మా పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసాము త్వరలోనే "ఇంతలో ఎన్నెని వింతలో" మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్ పెడుతున్నాము అని తెలియ చేశారు. మా హరిహర చలనచిత్ర బ్యానర్ లో 2వ ప్రాజెక్ట్ ని కుడా త్వరలో అనౌన్స్ చేస్తాము ఇప్పుడు "ఇంతలో ఎన్నెని వింతలో" సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పారు.

ఒక మీడియా మిత్రుడు మీ బ్యానర్ లో ఎ హీరోలతో సినిమాలు తియ్యాలి అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఆశ అనుకుంటే శ్రీ విష్ణు అత్యాశ అనుకుంటే బాలయ్య బాబు గారితో అని యువ నిర్మాత రామ్మోహనరావు ఇప్పిలి తెలిపారు.

English summary
Inthalo ennenni vinthalo movie has stepped into 2nd week in the hari hara chalana chitra banner which is released on april6th. This movie is getting huge response i both andhra pradesh and telangana. Producer Rammohan Rao was inaugurated the press meet on this occasion. On this occation Producer Ram Mohan Rao Ippili said that.. team "inthalo ennenni vinthalo" enjoying the film success only beacause of our media friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X