వరుణ్ తేజ్‌తో అనుకుంటే చివరకు రామ్ సెట్టయ్యాడు
రొటీన్ సినిమాల దారిలో కాకుండా భిన్నమై కథలు ఎంచుకుంటూ మంచి సక్సెస్ రేటుతో దూసుకెళుతున్నాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. విభిన్న కథలు చేయాలకునే దర్శకులు సైతం వరుణ్ తేజ్‌తో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దర్శకుడు సాగర్ చంద్ర కొంతకాలంగా వరుణ్ తేజ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతడిని ఒప్పిస్తే సినిమా నిర్మించడానికి తాము సిద్ధమే అని 14 రీల్స్ ప్లస్ సంస్థవారు ముందుకు వచ్చారట. అయితే అంతలోనే వరుణ్ తేజ్, హరీష్ శంకర్ మూవీకి సైన్ చేయడంతో 14 రీల్స్ వారు సైతం ఇటు వైపు టర్న్ అయ్యారు.

ఈ పరిణామాలతో డిసప్పాయింట్ అయిన సాగర్ చంద్ర ఈ సినిమాను మరొక హీరోతో చేయాలని డిసైడ్ అయ్యారని, హీరో రామ్ కథ విని ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్రవంతి మూవీస్ వారు దీన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.
అయితే రామ్ ఆల్రెడీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' మూవీ చేస్తుండటంతో ఇది పూర్తయిన తర్వాత సాగర్ చంద్ర మూవీ చేస్తానని చెప్పాడట. అలా వరుణ్ తేజ్‌తో అనుకున్న ప్రాజెక్టులోకి హీరో రామ్ వచ్చేశాడన్నమాట.


Click it and Unblock the Notifications











