రామ్...'రామ రామ కృష్ణ కృష్ణ' టైటిల్ జస్టిఫికేషన్
రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ' ఈ నెల 12న విడుదల అవుతోంది. ఇందులో హీరో రామ్ మెళ్లో ఓ డాలర్ ఉంటుంది. ఆ డాలర్‌కి ఒక సైడ్ రాముడు, మరో సైడ్ కృష్ణుడు ఉంటాడు. దీనికి పెద్ద కథే ఉంటుంది. రాముడిలా మాటమీద నిలబడి అందరికీ మంచి చేయమని తండ్రి రాముడి డాలర్ మెళ్లో వేస్తే...కృష్ణుడిలా మాయ చేసైనా...ఎదుటివారికి మంచి చేయమని అమ్మ కృష్ణుడి లాకెట్ వేస్తుంది. కాలక్రమంలో ఆ రెండు లాకెట్లను ఒకటిగా మార్చుకొని మెళ్లో వేసుకుంటాడు హీరో. అలాగే అమ్మానాన్నలు చెప్పిన రెండు సూత్రాలనూ పాటిస్తుంటాడు. ముందు మాటమీద నిలబడి మంచిగా చెప్పిచూస్తాడు. కుదరకపోతే లాకెట్ తిప్పుతాడు.. ఇక అక్కడ్నుంచి..రామకృష్ణ అల్లరి. ఈ పాత్రను రామ్ పోషించిన విధానం బాగా వచ్చిందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా ప్రియా ఆనంద్, బిందు మాధవి చేసారు. సీనియర్ హీరో అర్జున్ అశోక్ దేవగాకీ రోల్ చేశారు.


Click it and Unblock the Notifications











