Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
కొత్త లుక్‌తో రామ్.. ఉన్నది ఒకటే జిందగీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్
ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే యువకుడు అభిరామ్. నలుగురు స్నేహితులతో కలసి రాక్‌బ్యాండ్‌ను స్టార్ట్ చేస్తాడు. ఆ రాక్‌బ్యాండ్‌కి అతనే లీడర్. చిన్నప్పట్నుంచి హ్యాపీగా వెళ్తోన్న అభిరామ్ లైఫ్‌లోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. వాళ్లలో ఎవరితో అభిరామ్ ప్రేమలో పడ్డాడు? అభిరామ్ జిందగీలో స్నేహితులు ఎలాంటి పాత్ర పోషించారు? అసలు, అభిరామ్ కథేంటి? అనేది ఈ నెల (అక్టోబర్) 27న చూపిస్తామంటున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల.
అనుపమా, లావణ్యా హీరోయిన్లు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ'. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి. ‘స్రవంతి' రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటలీలో షూటింగ్..
ఈ సందర్భంగా ‘స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ- ‘‘ఇటలీలో రామ్‌పై చిత్రీకరించిన సన్నివేశాలతో సినిమా మొత్తం పూర్తయింది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. రామ్ అద్భుతంగా నటించాడు. కిశోర్ కథ, కథనం, దర్శకత్వం... ప్రతిదీ కొత్త పంథాలో ఉంటుంది. రామ్,
గ్యారెంటీగా సక్సెస్
కిశోర్ తిరుమల కలయికలో మేం నిర్మించిన ‘నేను శైలజ' తరహాలో ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో పాటల్ని, అక్టోబర్ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం'' అన్నారు.
అభిరామ్‌గా రామ్
దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ- ‘‘అభిరామ్ అనే వ్యక్తి జిందగీలో చైల్డ్‌హుడ్, కాలేజ్ లైఫ్, కాలేజ్ తర్వాత లైఫ్‌ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. అభిరామ్‌గా రామ్ జీవించారు. పాత్ర కోసం బాడీ మేకోవర్ కావడంతో పాటు సరికొత్త స్టయిల్లోకి మారారు. అతని నలుగురు స్నేహితులుగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌషిక్ కనిపించనున్నారు. అభిరామ్ కథలో భాగంగానే ప్రేమకథలూ ఉంటాయి. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అన్నారు.