దీపావళికి రామ్ ‘ఒంగోలు గిత్త’ ఫస్ట్ లుక్
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ... 'చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మా 'ఒంగోలు గిత్త' ఫస్ట్ లుక్ నవంబర్ 13న దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నాం. నవంబర్ మూడో వారంలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి డిసెంబర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ స్టార్ రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా.బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమా ప్రభ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈచిత్రానికి సంగీతం: జీవి ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటో గ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె.కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications












