twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ 'ఒంగోలు గిత్త' ఫస్ట్ లుక్ ఇదే

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఒంగోలు గిత్త'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ నిర్మిస్తోంది.బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి కానుకగా విడుదల చేసారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ "మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ నెల మూడో వారంలో పాటల్ని విడుదల చేస్తాం. వచ్చే నెల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఫ్యామిలీ టచ్‌తో ఉండే మాస్ ఎంటర్‌టైనర్. రామ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. సంపూర్ణమైన కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో వుంటాయి'' అని తెలిపారు.

    సమర్పకుడు బాపినీడు మాట్లాడుతూ... 'ప్యామిలీ టచ్ తో కూడిన మంచి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఒంగోలు గిత్త' టైటిల్ ని ఖరారు చేసాము. గుంటూరు మార్కెట్ యార్డులో పెద్ద షెడ్యూల్, హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ జరిగింది, తణుకులో నాన్ స్టాప్ గా షెడ్యూల్ జరుగుతోంది. నవంబర్ 15 వరకు షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. ఈ షెడ్యూల్ తో రెండు పాటలు మినహా టోటల్ షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు.

    డిసెంబర్లో సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. మార్కెట్ యార్డు నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని వెల్లడించారు.

    రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

    English summary
    
 Hero Ram’s upcoming film "Ongole Gitta" movie first look has been released on the ocassion of Diwali.Ram is romancing with Kriti Kharbanda in this film. The film is being directed by Bommarillu Bhaskar and BVSN Prasad is the producer.GV Prakash Kumar is composing the music. The movie audio will be released in the third week of November and the movie will hit the theaters in December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X