రామ్ ‘ఒంగోలు గిత్త’ తాజా అప్డేట్స్
ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ...'ప్యామిలీ టచ్ తో కూడిన మంచి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఒంగోలు గిత్త' టైటిల్ ని ఖరారు చేసాము. గుంటూరు మార్కెట్ యార్డులో పెద్ద షెడ్యూల్, హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ జరిగింది, తణుకులో నాన్ స్టాప్ గా షెడ్యూల్ జరుగుతోంది. నవంబర్ 15 వరకు షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. ఈ షెడ్యూల్ తో రెండు పాటలు మినహా టోటల్ షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు.
నవంబర్లో ఫస్ట్ లుక్ రిలీ్జ్ చేసి, డిసెంబర్లో సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. మార్కెట్ యార్డు నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని వెల్లడించారు.
రామ్, క్రితి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications












