twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ 'ఒంగోలు గిత్త' ఆయుధాలు ఇవే

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఒంగోలు గిత్త'. జనవరి మొదటి వారంలో విడుదల అయ్యే ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్, ఎంటర్ట్మైంట్ కలిసిన పాత్రలో రామ్ కనిపించనున్నారు. ఈ చిత్రంపై భాస్కర్ చాలా నమ్మకంగా ఉన్నారు. కృతికర్బంద హీరోయిన్ గా చేసే ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత.

    ఆయన ఈ చిత్రం గురించి చెప్తూ....ఒంగోలు పేరు చెప్పగానే గిత్తలు గుర్తొస్తాయి. ఆ కుర్రాడిదీ ఒంగోలే. అతని ధైర్యం మిగతావారికి మొండితనంలా కనిపిస్తుంది. అతని దూకుడు... నిర్లక్ష్యం అనుకొంటారు. ఇవన్నీ అతని ఆయుధాలు. ఇంతకీ వీటిని ఎవరిపై ప్రయోగించాడో తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు బొమ్మరిల్లు భాస్కర్‌.

    నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ... ''భాస్కర్‌ సినిమాలంటే కుటుంబ ప్రేక్షకులకు కావల్సిన అంశాలుంటాయి. రామ్‌ శైలి యువతరానికి నచ్చుతుంది. వెరసి... అన్ని వర్గాలకీ నచ్చేలా ఉంటందీ సినిమా. మార్కెట్‌ యార్డు నేపథ్యంలో నడుస్తుంది. జనవరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు.

    సమర్పకుడు బాపినీడు మాట్లాడుతూ... ప్యామిలీ టచ్ తో కూడిన మంచి మాస్ ఎంటర్ టైనర్ గా చిత్రం రూపొందుతోంది. జనవరిలో సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. బొమ్మరిల్లు, పరుగులాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. మార్కెట్ యార్డు నేపథ్యంలో ఈ కథ జరుగుతుందని వెల్లడించారు.

    రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

    English summary
    Ram and Kruthi Karbanda will be seen romancing each other in the upcoming film ‘Ongole Gitta’. The movie was originally supposed to hit the screens in the last week of December but it has now been shifted to January. The buzz in the industry is that the movie may be scheduled for an end January release. The film has been directed by Bommarillu Bhaskar B.V.S.S. Prasad is the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X