14 ఏళ్ల క్రితం లవ్ ఫెయిల్యూర్.. ఇప్పటికీ అలాంటి బాధ.. ఆ అనుభవం మర్చిపోలేం.. హీరో రామ్ ట్వీట్

దర్శకుడు సుకుమార్, ఆదిత్యబాబు నిర్మాతగా ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఇషా సహాని జంటగా నటించిన జగడం చిత్రం మార్చి 16వ తేదీతో 14 ఏళ్ల పూర్తి చేసుకొన్నది. తమ జీవితాల్లో ఎంతో ప్రత్యేకతగా మారిన ఈ చిత్రం గురించి దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, హీరో రామ్ తమ భావాలను పంచుకొన్నారు. ఈ సినిమా గురించి హీరో రామ్ చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. ఆయన పంచుకొన్న అనుభవాలు ఏమిటంటే...

జగడం సినిమా కథేంటంటే..

జగడం సినిమా కథేంటంటే..

17 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడు రౌడీ గ్యాంగులో చేరుతాడు. తాను చేరిన గ్యాంగ్‌కు ప్రత్యర్థిగా మరో పెద్ద గ్యాంగ్ ఉందనే విషయం అర్ధమవుతుంది. కానీ పెద్ద గ్యాంగ్‌కు ఎదురుపడటమే కాకుండా వారికి ధీటుగా నిలుస్తాడు. గ్యాంగ్ వార్ మధ్య తన ప్రేయసితో రొమాన్స్, ప్రేమ ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి యువకుడి జీవితంలో గ్యాంగ్ వార్ ఎలాంటి సమస్యలు సృష్టించిందనే విషయమే జగడం కథ.

ఆర్య కంటే ముందే జగడం అంటూ సుకుమార్

ఆర్య కంటే ముందే జగడం అంటూ సుకుమార్

ఆర్య కంటే ముందు జగడం చేద్దామనుకున్నాను. అప్పటికే నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. దాంతో ఆర్య తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చనే కాన్పిడెన్స్‌తో ఉన్నాను. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా కొత్తగా ప్రేమకథ చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఉన్న ఆలోచనలు రకరకాలుగా మారి జగడం కథగా మారింది అని దర్శకుడు సుకుమార్ అన్నారు.

రత్నవేలు సినిమాటోగ్రఫి గురించి

రత్నవేలు సినిమాటోగ్రఫి గురించి

14 ఏళ్ల క్రితం నటించిన జగడం సినిమా గురించి రామ్ తన అనుభవాలను, మెమొరీస్‌ను నెమరు వేసుకొన్నారు. రత్నవేలు కెమెరా పనితనం గురించి నేను ఎప్పుడూ మరిచిపోలేను. నా సోదర సమానుడైన నిర్మాత ఆదిత్య బాబు థ్యాంక్యూ. ఈ సమయంలో జయదేవ్ అంకల్‌ను గుర్తు చేసుకోవాల్సిందే. 14 ఏళ్ల తర్వాత కూడా జగడం సినిమాను గుర్తు చేసుకొని ఓ వేడుక జరుపుకొంటున్నారంటే అందుకు గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అంటూ రామ్ ట్వీట్ చేశారు.

జగడం లవ్ ఫెయిల్యూర్ లాంటింది

జగడం లవ్ ఫెయిల్యూర్ లాంటింది

జగడం సినిమా ఓ లవ్ ఫెయిల్యూర్ లాంటిది. జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని ఓ జ్ఞాపకం. 14 ఏళ్ల తర్వాత కూడా ఓ బాధ, మధురమైన అనుభవంగా ఉండిపోయింది. ఓ అందమైన అనుభవాన్ని నాకు అందించిన సుకుమార్‌కు థ్యాంక్స్. జగడం సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓ ఆత్మ లాంటింది అని ఎనర్జిటిక్ స్టార్ రామ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నా హృదయానికి దగ్గరగా జగడం

నా హృదయానికి దగ్గరగా జగడం

జగడం సినిమా నా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా. సుకుమార్ రైటింగ్, డైలాగ్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. చంద్రబోస్ రాసిన లిరిక్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా రత్నవేలు సినిమాటోగ్రఫి చూస్తే హాలీవుడ్ సినిమాగా అనిపిస్తుంది. అప్పటికి రామ్ హీరోగా చాలా యంగ్.. ఆ సినిమాను చాలా మెచ్యురిటీతో చేశారు. జగడం ఓ బ్యూటీఫుల్ జర్నీ. నిర్మాత ఆదిత్యబాబుకు, అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా వీడియో సందేశాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X