Just In
Don't Miss!
- Sports
గబ్బా టెస్ట్ విజయం అత్యంత సంతోషాన్నిచ్చింది: మోడీ
- News
జగన్ రెడ్డి క్రూరత్వం.. దేవినేని ఉమా అరెస్ట్ అక్రమం ; కొడాలి నానిపై కేసు పెట్టాలని చంద్రబాబు ఆక్రోశం
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఊహించడం చాలా కష్టం.. ఇస్మార్డ్ డేవిడ్ వార్నర్‌పై రామ్ కామెంట్స్
క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవసరమైతే అల్లు అర్జున్‌లా మారిపోయి ఐకానిక్ స్టెప్పులు వేస్తాడు. మన టాలీవుడ్ హీరోలను అనుకరించడంలో డేవిడ్ వార్నర్ ముందుంటాడు. లాక్డౌన్‌లో డేవిడ్ వార్నర్ టిక్ టాక్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో డేవిడ్ హవా కాస్త తగ్గినట్టు అనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం డేవిడ్ వార్నర్ ఇంకా మన తెలుగు సినిమాలను వదల్లేదనిపిస్తోంది.
ఐపీఎల్‌లో దుమ్ములేపిన డేవిడ్ తాజాగా మళ్లీ తెలుగు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు. పూరి జగన్నాథ్ మాస్ మసాలా చిత్రం ఇస్మార్ట్ శంకర్ లుక్‌లోకి డేవిడ్ వార్నర్ దూరిపోయాడు. అచ్చం ఇస్మార్ట్ శంకర్‌లా మారిపోయి అదే యాటిట్యూడ్‌ను ప్రదర్శించాడు. ఇస్మార్ట్ డేవిడ్‌గా మారిపోయిన తనను ఎవ్వరూ గుర్తు పట్టలేరేమో అని ఓ పజిల్ లాంటి ఫన్నీ కామెంట్ చేశాడు. దానికి మన రియల్ ఇస్మార్ట్ హీరో అదిరిపోయే కౌంటర్ వేశాడు.

డేవిడ్ వార్నర్ షేర్ చేసిన వీడియోను చూసిన రామ్ వెరైటీ రియాక్షన్ ఇచ్చాడు. అవును అతనెవరో గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉందని నవ్వేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. డేవిడ్ వార్నర్ ఇంతకు ముందు అల వైకుంఠపురములో నుంచి బుట్టబొమ్మ, రాములో రాముల అంటూ బన్నీలా స్టెప్పులు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చూస్తుంటే డేవిడ్‌కు మన తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నట్టు కనిపిస్తోంది.