RAPO20: వందల మంది ఫైటర్లతో రామ్ పోరాటం.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో బోయపాటి స్కెచ్!

మొదట్లో లవర్ బాయ్ గా ముద్ర వేసుకున్న హ్యాండ్సమ్ హీరో రామ్ పోతినేని.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని ఇస్మార్ట్ శంకర్ ద్వారా మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత అదే మాస్ తరహాలో వచ్చిన రెడ్, ది వారియర్ సినిమాలు రామ్ పోతినేనికి ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. ఇప్పుడు మరోసారి హీరోలకు హై ఎలివేషన్ ఇచ్చే మాస్ డైరెక్టర్ గా పేరొందిన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో RAPO20 (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. ఇందులో రామ్ తో భారీ పైట్ సన్నివేశాన్ని తరెకక్కిస్తున్నారని తాజాగా అందిన సమాచారంలోకి వెళితే..

మాస్ హీరోగా : తెలుగు చిత్ర పరిశ్రమలో దేవదాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని ఆ తర్వాత జగడం, రెడీ, మస్కా వంటి చిత్రాలు చేశాడు. వీటిలో హ్యాండ్సమ్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణించాడు. శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఓవైపు లవర్ బాయ్ గా ఉన్న కథలు చేస్తూనే మరోవైపు మాస్ హీరోగా తనను తాను చూపించుకునే ప్రయత్నం చేశాడు రామ్.

Ram Pothineni

సిక్స్ ప్యాక్ బాడీతో : అయితే రామ్ పోతినేనికి మాస్ హీరోగా హై ఎలివేషన్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో అట్రాక్ట్ చేశాడు. ఎన్నడూ కనిపించని విధంగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇలా మాస్, క్లాస్ చిత్రాలు చేసుకుంటూ వెళ్లిన రామ్ పోతినేని గతేడాది ది వారియర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.

అగ్ర నిర్మాణ సంస్థ : తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ది వారియర్ బైలింగువల్ మూవీ డిజాస్టర్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ ఎనర్జీటిక్ స్టార్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో RAPO20 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుండగా బ్యూటిఫుల్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది.

సెకండ్ ఇన్నింగ్స్ : ఇక రామ్ పోతినేని సినీ కెరీర్ లోనే తొలి సారిగా పాన్ ఇండియా మూవీగా వస్తున్న RAPO20కు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో యంగ్ హీరో ప్రిన్స్ సిసిల్ ను ఓకే చేసినట్లు సమాచారం. అలాగే ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనునందని టాక్. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు గత నెలలో ప్రకటించారు.

Ram Pothineni

హై రేంజ్ ఎలివేషన్ : RAPO20 విడుదల తేది పోస్టర్ లో రామ్ పోతినేని వీర మాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. పోట్ల గిత్తను పట్టుకుని లాక్కుని రామ్ వెళ్తున్న ఈ పోస్టర్ అదిరిపోయింది. ఇందులో భారీ ఎత్తులో బుల్ ఫైటింగ్ సీన్ ఉంటుందని ఓ వార్త హల్ చల్ చేయగా ఇప్పుడు మరో వార్త ఆసక్తికరంగా మారింది. బుల్ ఫైట్ మాత్రమే కాకుండా హై రేంజ్ ఎలివేషన్ ఇచ్చేలా ఓ ఫైట్ సీన్ ను తెరకెక్కిస్తున్నారట.

ప్రత్యేక ఆకర్షణ : ప్రస్తుతం హైదరాబాద్ లో RAPO20 యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. బుధవారం మొదలైన ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో జరగుతోంది. సుమారుగా 1500 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వారందరితో రామ్ పోరాటం చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు ఇది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X