నిజంగా టచ్ చేశారు.. ఇస్తా మొత్తం తిరిగిచ్చేస్తా.. రామ్ ఎమోషనల్ ట్వీట్
ఓ హీరోకు అత్యంత సంతోషం, ఎక్కడా లేని ఆనందం కలిగేది అభిమానులు చూపించే ప్రేమలోనే. వారేం చేసినా ఫ్యాన్స్ కోసమే. వారిని అలరించడం కోసం హీరోలు కష్టపడుతుంటారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ అభిమాన హీరో పుట్టిన రోజును ఓ పండగా ఫీల్ అవుతుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే నిన్న (మే 15) రామ్ పుట్టిన రోజును సోషల్ మీడియాలో పెద్ద పండుగలా జరిపారు ఫ్యాన్స్. అభిమానులతో పాటు టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం రామ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. తన పుట్టిన రోజున వెల్లువెత్తిన విషెస్‌ను చూసి రామ్ ఎమోషనల్ అయ్యాడు.

రామ్ బర్త్‌డే వైరల్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ బర్త్ డే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపారు. రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన కామన్ డీపీ కూడా తెగ వైరల్ అయింది.డీపీ సూపర్ ఉందంటూ స్పందించారు. ఇక రామ్ బర్త్ డే ట్విట్టర్‌లో ఫుల్ ట్రెండ్ అయింది.

మరో మాస్ బీట్..
రామ్ బర్త్ డే సందర్భంగా RED చిత్రం నుంచి మాస్ బీట్‌ను రిలీజ్ చేశారు. నిన్న ఉదయం పది గంటలకు విడుదల చేసిన డించక్ పాటలో మణి శర్మ బీట్, రామ్ స్టెప్స్, హెబ్బా పటేల్ అందాలు హైలెట్‌గా నిలిచాయి. ఇక ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మిలియన్ల వ్యూస్ దక్కించి మరో రామ్, మణిశర్మ కాంబో స్టామినాను నిరూపించింది.

వరుసబెట్టి రిప్లైలు..
తన మీద ప్రేమను కురిపించిన అందరికీ, విషెస్ చెప్పిన తారలందరికీ వరుసబెట్టి రిప్లైలు ఇచ్చాడు. పూరి జగన్నాద్, ఛార్మీ, నిధి, నభా, కాజల్, జెనీలియా, దేవీ శ్రీ ప్రసాద్, ప్రియదర్శి, లావణ్య, గోపీ మోహన్, కోన వెంకట్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా అందరికీ ధన్యవాదాదలు తెలిపాడు.
Recommended Video

తిరిగి ఇచ్చేస్తా..
తనపై కురిపించిన ప్రేమపై స్పందిస్తూ.. ‘నా ప్రియమైన అభిమానులారా.. మీరంతా నాకు ఉన్నారని ఈ ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు మీరు నా కోసం తినలేదని కనీసం పడుకోలేదని నేను విన్నాను.. నిజంగా టచ్ చేశారు.. మీ అందరూ ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.. ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా.. ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి' అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











