RAPO20 ఆగిపోయిందన్న మేకర్స్.. బూతులు తిడుతున్న రామ్ ఫ్యాన్స్.. నాగ చైతన్యను లాగి మరి!

దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల రెడ్, ది వారియర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అవి అంతగా విజయాన్ని అందించలేకపోయాయి.

అయితే ఇప్పుడు మంచి హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు రామ్. అందుకోసం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు వినిపించాయి.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత..

ఇస్మార్ట్ శంకర్ తర్వాత..

లవర్ బాయ్ గా ముద్ర వేసుకున్న టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రామ్ పోతినేని డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ద్వారా చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడు రామ్ పోతినేని. అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్ సినిమాలు రామ్ పోతినేనికి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి.

రామ్ ధీటుగా ఉండే విలన్..

రామ్ ధీటుగా ఉండే విలన్..

రామ్ కెరీర్ లో మొదటి బైలింగువల్ ప్రాజెక్ట్ అయిన లింగుస్వామి దర్శకత్వంలో హీరోయిన్ కృతీశెట్టి నటించిన ది వారియర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో తర్వాతి సినిమాతో మంచి హిట్ అందుకోవాలని ఆరాటాపడుతున్నాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. రామ్ తన తర్వాతి సినిమాను బోయపాటి శ్రీనుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ ధీటుగా ఉండే విలన్ గా యంగ్ హీరో ప్రిన్స్ సిసిల్ ను ఓకే చేశారు. ఇక బోయపాటి సినిమాల్లో విలన్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

8 నెలలు కావొస్తున్నా..

8 నెలలు కావొస్తున్నా..

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న RAPO20 చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ది వారియర్ సినిమా తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం, అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభమై 8 నెలలు కావొస్తున్న ఇప్పటికీ ఒక్క అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో ట్విట్టర్ లో కనిపించిన ఓ ట్వీట్ రామ్ ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది.

అధికారికంగా ఆపేశాం..

అధికారికంగా ఆపేశాం..

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ అకౌంట్ నుంచి శుక్రవారం ఒక షాకింగ్ ట్వీట్ చేశారు. "నటీనటులు, సాంకేతిక నిపుణుల సమస్యల కారణంగా మా పాన్ ఇండియా ప్రాజెక్ట్ #BoyapatiRAPO ఆగిపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాం. చిత్రీకరణ మొదలై 8 నెలలు గడిచింది. 15 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి అయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అధికారికంగా ఆపేశాం. మేం కలిగించిన అసౌకర్యానికి రామ్ కు క్షమాపణలు తెలుపుతున్నాం" అని ఉంది.

బూతులు తిడుతున్న ఫ్యాన్స్..

బూతులు తిడుతున్న ఫ్యాన్స్..

RAPO20 చిత్రాన్ని ఆపేస్తున్నట్లుగా వచ్చిన ఈ ట్వీట్ చూసిన రామ్ అభిమానులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. అయితే అది ఫేక్ అకౌంట్ అని తెలిసి బూతులు తిట్టుకుంటున్నారు. కొంతమంది మాత్రం ిది నిజమే అనుకుని ఆరా తీస్తున్నారు. కారణాలు చెప్పాలని కోరారు. దీంతో ఇందులో ఎలాంటి నిజం లేదని బయటపడింది. నిజానికి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పేరుతో ట్విటర్ లో ఒక ఫేక్ అకౌంట్ ఉంది. ఈ ఖాతా నుంచే శుక్రవారం RAPO20 మూవీ ఆగిపోయనట్లు ట్వీట్ వచ్చింది.

అభిమానుల అసహనం..

అభిమానుల అసహనం..

ఇదే శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై అక్కినేని నాగ చైతన్య హీరోగా కస్టడీ అనే బైలింగువల్ చిత్రం తెరకెక్కుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తియింది. మే 12న విడుదల చేయనున్నారు. నాగ చైతన్య కస్టడీ గురించి అప్డేట్స్ ఇస్తున్నారు కానీ, రామ్ సినిమా అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదేంటీ అని నిర్మాణ సంస్థపై రామ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. కాగా ఈ చిత్రంలో కన్నడ బ్యూటి శ్రీలీల తోపాటు సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. తమన్ సంగీతం అందించగా.. సంతోష్ సినిమాటోగ్రఫీ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X