twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడుతుంది.. హీరో రామ్ మరో సెన్సేషనల్ ట్వీట్

    |

    విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఇక ఈ ప్రమాదంపై కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతుంటే.. ఇంకొందరు కోవిడ్ సెంటర్‌గా మార్చి హాస్పిటల్ నిర్వహిస్తోన్న యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. ఈ ఘటనలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎంట్రీ ఇవ్వడం, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడంతో రచ్చ రచ్చగా మారింది. అసలు రామ్ ఎందుకు స్పందించాడు? రామ్‌పై ఎందుకు ట్రోల్స్ జరుగుతున్నాయి? అనే విషయాలు ఓ సారిచూద్దాం.

    అగ్ని ప్రమాదం..

    అగ్ని ప్రమాదం..

    విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం కోవిడ్ సెంటర్‌గా మార్చింది. అందులో అగ్ని ప్రమాదం సంభవించగా దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ ఘటనను దారి మళ్లించేందుకు ఫీజులు ఎక్కువగా వసూల్ చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేయసాగారు. ఈ రమేష్ హాస్పిటల్స్ రామ్ బంధువులవి కావడంతో ఇస్మార్ట్ హీరో రంగంలోకి దిగాడు.

    సీఎం జగన్‌ను ఉద్దేశించి..

    సీఎం జగన్‌ను ఉద్దేశించి..

    రామ్ తన బాబాయ్‌కి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో పెద్ద కుట్ర జరుగుతోందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రామ్ తెలిపాడు. వైఎస్ జగన్ గారు.. మీ కింద పనిచేసే వారే మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్టకి, మీ మీద మేము పెట్టుకొన్న నమ్మకానికి నష్టం వాటిల్లుతోందని, అలాంటి దుష్ప్రచారం చేసే వారిపై ఓ కన్నేస్తారని ఆశిస్తున్నామని మ్ పోతినేని ట్వీట్‌ చేశాడు.

    రామ్ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు..

    రామ్ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు..

    రామ్ ఇలా ట్వీట్ చేయడంపై సోషల్ మీడియాలో భిన్నాభి ప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లతో రామ్‌పై దాడి చేస్తున్నారు. మీ బాబాయ్ ఎందుకు పరారీలోఉన్నాడో చెప్పు బ్రో అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్లతో విసిగి పోయిన రామ్.. తాజాగా ఓ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

    ప్రజా శ్రేయస్సు కోసం..

    ప్రజా శ్రేయస్సు కోసం..

    ఫీజులు ఎక్కువగా వసూల్ చేస్తున్నారని, నెగెటివ్ వచ్చినా కూడా చికిత్స చేస్తున్నారనే కామెంట్లపై స్పందిస్తూ.. ‘ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం..! RT - PCR టెస్టు చేయించుకున్న‌ప్పుడు కుటుంబంలో 10 మందిలో 8 మందికి నెగ‌టివ్ వ‌చ్చినా స‌రే, CT SCANలో కోవిడ్ ఉన్న‌ట్టు గ‌మ‌నిస్తే, వెంట‌నే వారిని ఆసుప‌త్రుల్లో చేర్పించండి. అలాంటి వారు సైలెంట్‌గా స్ప్రెడ్ చేయ‌డంవ‌ల్ల ఇత‌రులు ప్ర‌మాదంలో ప‌డ‌తారు' అని పేర్కొన్నాడు.

    Recommended Video

    #NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
    తప్పు చేసింది ఎవరైనా సరే..

    తప్పు చేసింది ఎవరైనా సరే..

    తనపై వస్తోన్న కామెంట్లపై రామ్ స్పందిస్తూ.. ‘న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.. నిజమైన ద్రోహులు ఎవరైనా సరే వారికి శిక్షపడుతుంది.. మనవారైనా వేరే వారైనా.. అది ఎవరైనా సరే. నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను.. ఇకపై ఈ విషయంపై నేనీమీ ట్వీట్ చేయను.. జై హింద్' అంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Ram Pothineni Fed Up With Trolling By Reacting On Swarna Palace fire accident. I believe in Justice and im sure the real culprits will be punished no matter who they are.. related or not..I won’t be tweeting about this anymore as I’ve said all I had to..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X