హరీష్ శంకర్‌కు హీరో రామ్ సాలిడ్ రిప్లై.. నేనూ అదే కోరుకుంటున్నా అంటూ!

తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా మూవీలు రూపొందుతోన్నాయి. అందులో చిన్న చిత్రాలతో పాటు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఉంటున్నాయి. ఈ కారణంగానే విడుదల సమయంలో కొన్ని మూవీలకు మధ్యన క్లాస్ కూడా ఏర్పడుతోంది. ఫలితంగా కొన్ని వివాదాలు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్', 'మిస్టర్ బచ్చన్' సినిమాల మధ్యన కనిపిస్తోంది. అలాంటిది ఇప్పుడు ట్విట్టర్‌లో హీరో రామ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మధ్యన ఆసక్తికర సంభాషణ జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించిన సినిమానే 'డబుల్ ఇస్మార్ట్'. ఇది 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీ షూట్ కూడా ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం ప్రమోషనల్ వర్క్‌లు జరుగుతున్నాయి.

Ram Pothineni Gives Surprising Reply To Harish Shankar In X Account

సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో X (ట్విట్టర్) ఖాతాలో చాలా మంది ఈ సినిమాపై అంచనాలను పెంచే ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంతో హైప్ నడుమ రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ కట్ గురించి ఒక ట్వీట్ హైలైట్ అవుతోంది.

Ram Pothineni Gives Surprising Reply To Harish Shankar In X Account

సోషల్ మీడయాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హరీష్ శంకర్.. ఆ ట్వీట్‌పై స్పందించాడు. ఈ మేరకు 'పూరీ జగన్నాథ్ సార్ క్రియేట్ చేసిన మ్యాజికల్ క్యారెక్టర్‌లో రామ్ పోతినేని ఎనర్జీని చూసేందుకు వేచి చూడలేకపోతున్నాను. దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అని రాసుకొచ్చాడు. దీంతో ఇది హైలైట్ అవుతోంది. దీనిపై హీరో రామ్ పోతినేని కూడా రియాక్ట్ అయ్యాడు.

స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్‌పై స్పందించిన రామ్ పోతినేని 'ధన్యవాదాలు. మీరు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ రిప్లై ఇచ్చాడు. వీళ్లిద్దరూ చేసుకున్న ఈ సంభాషణలు హాట్ టాపిక్ అవుతోన్నాయి. అదే సమయంలో ఈ రెండు చిత్ర యూనిట్ల మధ్య వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు కూడా ఇప్పటితో పుల్‌స్టాప్ పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X